చంద్రబాబు గుట్టును బయటపెట్టిన అడ్వకేట్ జనరల్
హైకోర్టు తీర్పు రాగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానే స్వీయ నియామక ప్రకటన చేసుకున్నారు. తాను తిరిగి విధుల్లోకి వచ్చేశానంటూ అధికారులకు సర్కూలర్ పంపించుకున్నారు. హైదరాబాద్‌కు వాహనాలను పంపాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. హైకోర్టు తీర్పును పూర్తిగా చదవకుండానే ఎన్నికల సంఘం కార్యాలయం ఇన్‌చార్జ్ కార్యదర్శి సాయిప్రసాద్… నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ధృవీకరిస్తూ సర్కూలర్ ను శుక్రవారం విడుదల చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు […]
హైకోర్టు తీర్పు రాగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానే స్వీయ నియామక ప్రకటన చేసుకున్నారు. తాను తిరిగి విధుల్లోకి వచ్చేశానంటూ అధికారులకు సర్కూలర్ పంపించుకున్నారు. హైదరాబాద్‌కు వాహనాలను పంపాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. హైకోర్టు తీర్పును పూర్తిగా చదవకుండానే ఎన్నికల సంఘం కార్యాలయం ఇన్‌చార్జ్ కార్యదర్శి సాయిప్రసాద్… నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ధృవీకరిస్తూ సర్కూలర్ ను శుక్రవారం విడుదల చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిందేగానీ… వెళ్లి స్వయంగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా నిమ్మగడ్డకు హైకోర్టు ఎక్కడా చెప్పలేదని అడ్వకేట్ జనరల్ వివరించడంతో ఎన్నికల సంఘం సర్కూలర్‌ను వెనక్కు తీసుకుంది.
ఇక్కడ మరో కీలక అంశం కూడా అడ్వకేట్ జనరల్ శ్రీరాం మీడియా సమావేశం ద్వారా బయటకు వచ్చింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను చంద్రబాబు కావాలని నియమించుకున్నారని… ఒకే వర్గం కావడంతో నిమ్మగడ్డ కూడా చంద్రబాబు చెప్పినట్టు వింటున్నారని వైసీపీ ఇటీవల ఆరోపించింది. ఆ ఆరోపణకు స్పందించిన చంద్రబాబు అప్పట్లో ఒక వివరణ ఇచ్చారు. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను సీఆర్ బిస్వాల్‌ను ఎన్నికల కమిషనర్‌గా సిఫార్సు చేశాను… కానీ గవర్నర్ మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నియమించారని చంద్రబాబు చెప్పారు. కాబట్టి నిమ్మగడ్డ నియామకంలో తన పాత్ర లేదని చెప్పారు.
అయితే అడ్వకేట్ జనరల్ శ్రీరాం కొన్ని లేఖలను మీడియా సమావేశంలో చదివి వినిపించారు. వాటి ప్రకారం నవంబర్ 16న చంద్రబాబు నాయుడు గవర్నర్‌కు సిఫార్సు లేఖ పంపించారు. సీఆర్ బిస్వాల్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని చంద్రబాబునాయుడు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా ఇటీవల అంగీకరించారు.
అయితే ఆ తర్వాత మరుసటి నెలకే చంద్రబాబునాయుడు గవర్నర్‌కు మరో లేఖ రాశారు. డిసెంబర్ 12 … 2015న సీఆర్ బిస్వాల్‌ను కాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించాలని చంద్రబాబు సిఫార్సు చేశారు. అంటే తాను సీఆర్ బిస్వాల్‌ను మాత్రమే సిఫార్సు చేశాను… నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరును సిఫార్సు చేయలేదు… గవర్నరే నియమించారని చంద్రబాబు చెప్పింది అబద్దమని అడ్వకేట్ జనరల్ చెబుతున్న దాని బట్టి తెలిసిపోతోంది.