భూకబ్జా జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా....
ఏడాది కాలంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపెట్టారని.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆయన 90 శాతం అమలు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ ఫొటోలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విశాఖ భూకబ్జాలపై టీడీపీ నేతలు అసంబద్ద […]
ఏడాది కాలంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నడూ జరగని అభివృద్ధిని చేసి చూపెట్టారని.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఆయన 90 శాతం అమలు చేశారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ ఫొటోలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
విశాఖ భూకబ్జాలపై టీడీపీ నేతలు అసంబద్ద ఆరోపణలు చేస్తున్నారని.. ఏడాది పాలన విజయవంతం కావడంతో వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన చెప్పారు. ఈ ఏడాది కాలంలో విశాఖలో అడుగు భూమైనా కబ్జా జరిగిందని నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
పార్టీ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని.. టీడీపీ కార్యకర్తల బెదిరింపులకు జడవవద్దని ఆయన అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు త్వరలోనే పదవులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సీఎం వైఎస్ జగన్ జనరంజక పాలన చూసి ప్రతిపక్షనేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఓర్వలేక పోతున్నారని.. కావాలనే రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ సంకల్పాన్ని అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.