Telugu Global
Cinema & Entertainment

పూజా హెగ్డే ఎకౌంట్ హ్యాక్

స్టార్స్, సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. దీనికోసం సోషల్ మీడియాలో ఎకౌంట్స్ ఉంటాయి. ఆ ఎకౌంట్స్ కు లక్షలు, కోట్లలో ఫాలోవర్స్ ఉంటారు. నిత్యం యాక్టివ్ గా ఉండే అలాంటి ఎకౌంట్ హ్యాక్ అయితే ఎలా ఉంటుంది. పూజా హెగ్డేకు అది అనుభవంలోకి వచ్చింది. అవును.. పూజా హెగ్డేకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్ అయింది. తన ఎకౌంట్ హ్యాక్ అయిందని ట్విట్టర్ లో ప్రకటించింది పూజా హెగ్డే. […]

పూజా హెగ్డే ఎకౌంట్ హ్యాక్
X

స్టార్స్, సెలబ్రిటీలు తమ ఫ్యాన్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. దీనికోసం సోషల్ మీడియాలో ఎకౌంట్స్ ఉంటాయి. ఆ ఎకౌంట్స్ కు లక్షలు, కోట్లలో ఫాలోవర్స్ ఉంటారు. నిత్యం యాక్టివ్ గా ఉండే అలాంటి ఎకౌంట్ హ్యాక్ అయితే ఎలా ఉంటుంది. పూజా హెగ్డేకు అది అనుభవంలోకి వచ్చింది. అవును.. పూజా హెగ్డేకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ హ్యాక్ అయింది.

తన ఎకౌంట్ హ్యాక్ అయిందని ట్విట్టర్ లో ప్రకటించింది పూజా హెగ్డే. తన ఎకౌంట్ నుంచి ఎవరికైనా మెసేజీలు వస్తే స్పందించొద్దని, వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని కోరింది. ఆ వెంటనే టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి, గంటలో పరిస్థితిని చక్కదిద్దింది. దీంతో పూజా హెగ్డే మరోసారి ట్విట్టర్ లో స్పందించింది. తన ఎకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయిందని, తనకు సంబంధం లేకుండా పడిన పోస్టుల్ని తొలిగించామని స్పష్టంచేసింది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా రెగ్యులర్ గా టచ్ లో ఉంటోంది పూజా హెగ్డే. మరీ ముఖ్యంగా ఇనస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాంటి ఎకౌంట్ హ్యాక్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు.

First Published:  29 May 2020 2:00 AM IST
Next Story