Telugu Global
National

డ్రగ్స్‌ వల్లనే కన్నా కోడలు మృతి " ప్రముఖ పత్రికలో కథనం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు సుహారిక మృతిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ద హిందూలో ఒక కథనం వచ్చింది. పోలీసులు ఇచ్చిన వివరాలతో ఆ కథనాన్ని పత్రిక ప్రచురించింది. మోతాదుకు మించి సైకోట్రిపిక్ డ్రగ్‌ను తీసుకోవడం వల్లే ఆమె చనిపోయినట్టు పోలీసులు చెప్పారని వివరించింది. పార్టీలో నలుగురు ఉన్నట్టు గుర్తించారు. పార్టీలో డ్యాన్స్‌లు వేశారని… ఆ సమయంలో ఇతరులు కూడా డ్రగ్స్ తీసుకుని ఉంటారని భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి పత్రికకు వివరించారు. […]

డ్రగ్స్‌ వల్లనే కన్నా కోడలు మృతి  ప్రముఖ పత్రికలో కథనం
X

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు సుహారిక మృతిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ద హిందూలో ఒక కథనం వచ్చింది. పోలీసులు ఇచ్చిన వివరాలతో ఆ కథనాన్ని పత్రిక ప్రచురించింది. మోతాదుకు మించి సైకోట్రిపిక్ డ్రగ్‌ను తీసుకోవడం వల్లే ఆమె చనిపోయినట్టు పోలీసులు చెప్పారని వివరించింది.

పార్టీలో నలుగురు ఉన్నట్టు గుర్తించారు. పార్టీలో డ్యాన్స్‌లు వేశారని… ఆ సమయంలో ఇతరులు కూడా డ్రగ్స్ తీసుకుని ఉంటారని భావిస్తున్నట్టు సీనియర్ పోలీసు అధికారి పత్రికకు వివరించారు. సుహారిక మోతాదుకు మించి డ్రగ్ తీసుకోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆమె కుప్పకూలిపడిపోయారని పోలీసు అధికారి వెల్లడించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. కన్నా లక్ష్మీనారాయణ చిన్న కుమారుడు ఫణీంద్రకు… సుహారికకు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. సుహారికది నెల్లూరు జిల్లా. వీరికి ఇంకా పిల్లలు లేరు.

తన చెల్లి భర్త స్నేహితులు పార్టీ ఇస్తుండడంతో అక్కడికి సుహారిక వెళ్లారు. సుహారిక చెల్లెలు భర్త ప్రవీణ్ కి వివేక్, విహాస్, పవన్‌ రెడ్డిలు స్నేహితులు. పవన్‌ రెడ్డి గచ్చిబౌలిలోని ఇంట్లో గురువారం ఈ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అందరూ కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఇలా డ్యాన్స్‌ వేస్తున్న సమయంలోనే సుహారిక స్పృహ తప్పి పడిపోయారు.

సుహారిక మరణంపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని… ఆమె భర్త ఫణీంద్రతో పాటు ఆమె తల్లి కూడా పోలీసులకు చెప్పారు. అయితే డ్రగ్‌ కారణంగా ఆమె చనిపోయారని ఆంగ్ల పత్రిక వద్ద పోలీసులు చెప్పడం కీలకంగా ఉంది. కోడలు మృతి విషయం తెలుసుకున్న కన్నా లక్ష్మీనారాయణ… తన కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లారు.

First Published:  29 May 2020 3:23 AM GMT
Next Story