వైజాగ్ వెళ్లకుండానే హైదరాబాద్‌కు బాబు జంప్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరిగి హైదరాబాద్ గూటికి చేరుకున్నారు. ఏపీకి వచ్చినా పని పూర్తి చేసుకోకుండానే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తానని … ఆ తర్వాత కరకట్ట వద్ద ఉన్న నివాసానికి వెళ్తానని అనుమతి తీసుకున్నారు. అయితే విశాఖ వెళ్లలేదు. ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించలేదు. కేవలం కరకట్ట భవనం నుంచి జూమ్‌లో మహానాడు కార్యక్రమాన్ని మాత్రమ నిర్వహించారు. అది పూర్తి కాగానే కుమారుడు నారాలోకేష్‌తో కలిసి… రోడ్డు మార్గంలో హైదరాబాద్ […]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరిగి హైదరాబాద్ గూటికి చేరుకున్నారు. ఏపీకి వచ్చినా పని పూర్తి చేసుకోకుండానే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తానని … ఆ తర్వాత కరకట్ట వద్ద ఉన్న నివాసానికి వెళ్తానని అనుమతి తీసుకున్నారు.
అయితే విశాఖ వెళ్లలేదు. ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించలేదు. కేవలం కరకట్ట భవనం నుంచి జూమ్‌లో మహానాడు కార్యక్రమాన్ని మాత్రమ నిర్వహించారు. అది పూర్తి కాగానే కుమారుడు నారాలోకేష్‌తో కలిసి… రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2.42 నిమిషాలకు ఆయన ఉండవల్లి నుంచి బయలుదేరారు.
అసలు చంద్రబాబు ఎందుకు వచ్చారు? ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వెళ్లిపోయారు అన్న దానిపై చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోనే ఉండిఉంటే కనీసం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించే అవకాశం అయినా ఉండేది కాదా అని ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ముఖం చూపించే ఉద్దేశం లేకనే చంద్రబాబు ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను సాకుగా వాడుకుని ఏపీకి వచ్చినట్టు భావిస్తున్నారు.