Telugu Global
National

టీటీడీకి చెందిన ఎలాంటి ఆస్తులను విక్రయించం... స్వామీజీలు, భక్తులతో కమిటీ వేస్తున్నాం...

ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామి వారి ఆస్తులు గానీ, టీటీడీ ఆస్తులు గానీ, భక్తులు కానుక రూపంలో ఇచ్చిన ఆస్తులు గానీ వేలం వేయకూడదని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పాలకమండలి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… నిరుపయోగంగా ఉన్న ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై చర్చించేందుకు స్వామీజీలతో, బోర్టు సభ్యులు, మేధావులు, భక్తులతో కమిటీ వేస్తున్నట్టు చెప్పారు. భక్తుల మనోభావాలకు దెబ్బతగలకుండా ఈ కమిటీ ద్వారా […]

టీటీడీకి చెందిన ఎలాంటి ఆస్తులను విక్రయించం... స్వామీజీలు, భక్తులతో కమిటీ వేస్తున్నాం...
X

ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామి వారి ఆస్తులు గానీ, టీటీడీ ఆస్తులు గానీ, భక్తులు కానుక రూపంలో ఇచ్చిన ఆస్తులు గానీ వేలం వేయకూడదని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

పాలకమండలి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… నిరుపయోగంగా ఉన్న ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న దానిపై చర్చించేందుకు స్వామీజీలతో, బోర్టు సభ్యులు, మేధావులు, భక్తులతో కమిటీ వేస్తున్నట్టు చెప్పారు. భక్తుల మనోభావాలకు దెబ్బతగలకుండా ఈ కమిటీ ద్వారా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

వారం రోజులుగా కొన్ని మీడియా సంస్థలు పాలకమండలిపై తప్పుడు ప్రచారం చేశాయన్నారు. గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని తమకు ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ ప్రచారం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలిసితీసేందుకు ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేయించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

గెస్ట్‌ హౌజ్‌లను కొందరికి కేటాయిస్తున్నట్టు మరో పత్రిక ఒక అసత్య కథనాన్ని ప్రచురించిందన్నారు. పాత గెస్ట్‌ హౌస్‌లను పునరుద్దరించేందుకు ముందుకొచ్చే దాతలకు పారదర్శకంగా ఇస్తామన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత స్వామివారి దర్శనంపై విధివిధానాలను రూపొందిస్తామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మించాలని బోర్డు తీర్మానించింది.

First Published:  28 May 2020 1:23 PM IST
Next Story