Telugu Global
CRIME

బోరు బావిలో పడిన బాలుడి కథ విషాదాంతం

మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చనపల్లిలో బుధవారం సాయంత్రం బోరు బావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది. గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సొంత వాళ్లందరూ చూస్తుండగానే సాయివర్థన్ బావిలో పడిపోయాడు. రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విగతజీవిగానే పైకి వచ్చాడు. ముద్దులొలికే తమ […]

బోరు బావిలో పడిన బాలుడి కథ విషాదాంతం
X

మెదక్ జిల్లా పాపన్న పేట మండలం పొడ్చనపల్లిలో బుధవారం సాయంత్రం బోరు బావిలో పడిన బాలుడు సాయివర్ధన్ కథ విషాదాంతమైంది.

గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సొంత వాళ్లందరూ చూస్తుండగానే సాయివర్థన్ బావిలో పడిపోయాడు. రెస్క్యూ టీమ్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విగతజీవిగానే పైకి వచ్చాడు.

ముద్దులొలికే తమ చిన్నారి ప్రాణాలు లేక శవంగానే మిగిలాడని తెలియడంతో కన్నవారి శోకం స్థానికులందరిని కంట తడి పెట్టించింది. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

విషయం తెలిసిన వెంటనే స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. ఆక్సిజన్ పైపులను బోరు బావిలోకి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ ఫలించలేదు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టరు ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు సంఘటనా స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. కానీ సాయివర్థన్‌ను రక్షించలేకపోయారు.

సాగు నీటికోసం సాయివర్ధన్ తాత వేయించిన బోరులో నీళ్లు పడలేదు. అయితే దాన్ని అలాగే ఉంచేశారు. బుధవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లిన సాయివర్థన్ అందులో పడిపోయి మృతి చెందాడు.

కాగా, ఈ విషాద ఘటనను చూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. నీళ్లు పడని బోరుబావులను రైతులు, స్థానిక అధికారులు పూడ్చివేయాలని వేడుకున్నారు. ఈ ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

First Published:  28 May 2020 6:54 AM IST
Next Story