Telugu Global
NEWS

మీరు ఏపీని నాశనం చేశారు... " బాలకృష్ణపై నాగబాబు ఫైర్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో విబేధాలు మరోసారి రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లను తిరిగి ఎలా ప్రారంభించాలన్న దానిపై ఇటీవల చిరంజీవి నేతృత్వంలోని బృందం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలకు బాలకృష్ణను ఆహ్వానించలేదు. ఈ పరిణామంపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నటుడు నాగబాబు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. చిత్రపరిశ్రమకు సంబంధించిన సమావేశాలకు తనను ఎవరూ పిలువలేదని…. పేపర్లు, టీవీ చూసి తెలుసుకున్నా అని తొలుత బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా కొన్ని […]

మీరు ఏపీని నాశనం చేశారు...  బాలకృష్ణపై నాగబాబు ఫైర్‌
X

తెలుగు చిత్ర పరిశ్రమలో విబేధాలు మరోసారి రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్‌లను తిరిగి ఎలా ప్రారంభించాలన్న దానిపై ఇటీవల చిరంజీవి నేతృత్వంలోని బృందం తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలకు బాలకృష్ణను ఆహ్వానించలేదు. ఈ పరిణామంపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నటుడు నాగబాబు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు.

చిత్రపరిశ్రమకు సంబంధించిన సమావేశాలకు తనను ఎవరూ పిలువలేదని…. పేపర్లు, టీవీ చూసి తెలుసుకున్నా అని తొలుత బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు.

శ్రీనివాస్‌ యాదవ్ ఇంట్లో కూర్చుని హైదరాబాద్‌లో భూములను సినిమా వాళ్లు కొందరు పంచుకుంటున్నారని ఆరోపించారు. రియల్‌ ఎస్టేట్ కోసం మీటింగ్‌లు పెట్టారు అన్నారు. ఆ తర్వాత కొన్ని బూతులు కూడా బాలకృష్ణ తిట్టారు. ఇలా చిరంజీవి నేతృత్వాన్ని, ఆ బృందాన్ని బాలకృష్ణ దూషించడంపై నటుడు నాగబాబు తీవ్రంగా స్పందించారు. బాలకృష్ణకు నేరుగానే వార్నింగ్ ఇచ్చారు.

”మీటింగ్‌లకు ఆయన్ను పిలకవపోవడం సరైనదా కాదా అన్నది నాకు తెలియదు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు. దానికే భూములు పంచుకుంటున్నారు అంటావా?. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సరికాదు. మీరు ఒకటి అంటే మేం పది మాటలు అనడానికి సిద్ధం. ఆ మాటలు ఏంటి ?. ఇదా ఇండస్ట్రీపై ఉన్న గౌరవం. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించావు‌. సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం భూపందారం చేస్తోందా?. వెంటనే సినీ పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి.
ఏం మాట్లాడుతున్నారు మీరు?. తప్పుడు మాటలు మాట్లాడవద్దు. రియల్‌ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారన్న దానిపై ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే తెలుస్తుంది. మీ తెలుగుదేశం పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని ఎలా నాశనం చేసింది… అక్కడి సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయి మీ తెలుగుదేశం పార్టీని నమ్మడం వల్ల… ఏం మాట్లాడినా చూస్తూ నోరు మూసుకుని కూర్చునే వారు ఎవరూ లేరిక్కడ. చిత్రపరిశ్రమకు నీవేమీ కింగ్‌ కాదు. మీరు జస్ట్‌ ఒక హీరో. మాటలు కంట్రోల్‌లో పెట్టుకోండి నేర్చుకోండి .”
అంటూ నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.

గతంలో కూడా ఒకసారి బాలకృష్ణకు నాగబాబుకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో చర్చల విషయంలో బాలకృష్ణను పక్కన పెట్టి చిరంజీవి లీడ్‌ చేయడంతో వివాదం చెలరేగింది. నాగాబాబు వార్నింగ్‌పై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారన్న బాలకృష్ణ వ్యాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  28 May 2020 3:41 PM IST
Next Story