Telugu Global
National

టీటీడీ ఆస్తుల విక్రయం రద్దు

టీటీడీ ఆలయ ఆస్తుల విక్రయం వివాదానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలికింది. ఆస్తుల విక్రయాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. టీటీడీకి చెందిన 50 ఆస్తులను విక్రయించేందుకు 2016లో నాటి టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచేందుకు ప్రస్తుత పాలక మండలి ప్రయత్నించగా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియా కూడా తప్పంతా ప్రస్తుత పాలక మండలిదే అన్నట్టుగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్ రెడ్డి […]

టీటీడీ ఆస్తుల విక్రయం రద్దు
X

టీటీడీ ఆలయ ఆస్తుల విక్రయం వివాదానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలికింది. ఆస్తుల విక్రయాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. టీటీడీకి చెందిన 50 ఆస్తులను విక్రయించేందుకు 2016లో నాటి టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.

గత పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచేందుకు ప్రస్తుత పాలక మండలి ప్రయత్నించగా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియా కూడా తప్పంతా ప్రస్తుత పాలక మండలిదే అన్నట్టుగా ప్రచారం చేసింది.

ఈ నేపథ్యంలో జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి వ్యవహారం వెళ్లడంతో వివాదానికి ముగింపు పలకాల్సిందిగా ఆదేశించారు.

దాంతో గత టీటీడీ పాలక మండలి నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆస్తులను దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారం తదితర అవసరాలకు టీటీడీ ఉపయోగించుకునే అంశంపై మత పెద్దలు, భక్తులు తదితరులతో చర్చించాలని సూచించింది. అంతవరకు ఆ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను నిలుపుదల చేయాలని కోరింది. ఈ అంశంపై టీటీడీ ఈఓ తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

First Published:  26 May 2020 12:26 AM IST
Next Story