సుద్దాల అశోక్ తేజ ఆపరేషన్ సక్సెస్
ప్రముఖ గేయ రచయిత, జాతీయ అవార్డ్ గ్రహీత సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ సక్సెస్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్.. రోజంతా కొనసాగింది. సాయంత్రానికి సర్జరీ పూర్తయి, సక్సెస్ అయినట్టు తెలిపారు. సుద్దాల అశోక్ తేజకు ఆయన కొడుకు అర్జున్ కాలేయాన్ని దానం చేశారు. ఆపరేషన్ జరిగినంతసేపు అశోక్ తేజ మేనల్లుడు ఉత్తేజ్, తమ్ముడు సుధాకర్ తేజ్ హాస్పిటల్ లోనే ఉన్నారు. సర్జరీని […]
ప్రముఖ గేయ రచయిత, జాతీయ అవార్డ్ గ్రహీత సుద్దాల అశోక్ తేజకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ సక్సెస్ అయినట్టు వైద్యులు ప్రకటించారు. నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్.. రోజంతా కొనసాగింది. సాయంత్రానికి సర్జరీ పూర్తయి, సక్సెస్ అయినట్టు తెలిపారు. సుద్దాల అశోక్ తేజకు ఆయన కొడుకు అర్జున్ కాలేయాన్ని దానం చేశారు.
ఆపరేషన్ జరిగినంతసేపు అశోక్ తేజ మేనల్లుడు ఉత్తేజ్, తమ్ముడు సుధాకర్ తేజ్ హాస్పిటల్ లోనే ఉన్నారు. సర్జరీని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన వైద్యులకు, రక్తం దానం చేసిన దాతలకు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈయన తెలంగాణ ప్రభుత్వ వాస్తు సలహాదారుడిగా కొనసాగుతున్నారు. నిన్న సాయంత్రమే అశోక్ తేజ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
సుద్దాల అశోక్ తేజ సర్జరీకి ముందు అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఆయన పరిస్థితి పూర్తిగా విషమించిందని కొందరు, రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారని మరికొందరు కథనాలు రాశారు. వీటన్నింటిపై నటుడు ఉత్తేజ్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లు నిలిచిపోయాయి. ఆ వెంటనే అశోక్ తేజను హాస్పిటల్ లో జాయిన్ చేయడం, ఆయనకు విజయవంతంగా ఆపరేషన్ జరగడం చకచకా జరిగిపోయాయి.