సుధాకర్ కేసు విచారణకు సీబీఐలో ఎస్‌ఐ స్థాయి అధికారే...
మద్యం సేవించి నడిరోడ్డుపై వీరంగం సృష్టించడంతో పాటు ముఖ్యమంత్రి, ప్రధానిని నోటికొచ్చినట్టు తిట్టి… రెండు మతాలను దూషించి, అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై సిగరెట్లు కాల్చి విసిరేసి నానా రభస చేసిన మత్తు డాక్టర్ సుధాకర్‌ను ఆ తర్వాత పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. దాంతో ఆయన మత్తు వీరంగం, నాయకులను దూషించడం, మతాలను కించపరచడం వంటి అంశాలు వెనక్కు వెళ్లి … అరెస్ట్ చేసిన తీరుపై ప్రతిపక్షాలు, కోర్టు తీవ్రంగా స్పందించాయి. హైకోర్టు ఏకంగా సీబీఐ […]
మద్యం సేవించి నడిరోడ్డుపై వీరంగం సృష్టించడంతో పాటు ముఖ్యమంత్రి, ప్రధానిని నోటికొచ్చినట్టు తిట్టి… రెండు మతాలను దూషించి, అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై సిగరెట్లు కాల్చి విసిరేసి నానా రభస చేసిన మత్తు డాక్టర్ సుధాకర్‌ను ఆ తర్వాత పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
దాంతో ఆయన మత్తు వీరంగం, నాయకులను దూషించడం, మతాలను కించపరచడం వంటి అంశాలు వెనక్కు వెళ్లి … అరెస్ట్ చేసిన తీరుపై ప్రతిపక్షాలు, కోర్టు తీవ్రంగా స్పందించాయి.
హైకోర్టు ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విచారణకు ఆదేశించడంతో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. చాలా చిన్న వ్యవహారం కావడంతో ఈ కేసు విచారణను సీబీఐలో ఎస్‌ఐ స్థాయి అధికారికి అప్పగించారు.
ఎస్‌ఐ స్థాయి అధికారి ఒకరు విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడి పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఎస్‌ఐ సూర్యనారాయణ, మరో హోంగార్డును వెంటబెట్టుకుని వెళ్లి మత్తు డాక్టర్ వీరంగం సృష్టించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాలను నోట్ చేసుకుని సీబీఐ ఎస్‌ఐ వెళ్లిపోయారు.