యాచకురాలిని చూసి మనసుపడ్డాడు... ఆపై పెళ్లాడాడు..!
కరోనా కష్టకాలం ఎందరినో కుటుంబాలకు దూరంగా ఉంచుతుంటే.. ఈ యువకుడికి మాత్రం పెళ్లి చేసింది. లాక్‌డౌన్ సమయంలో చూసిన అమ్మాయిపై ప్రేమ పెంచుకొని చివరకు పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. సాధారణంగా ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు చూసే ఉంటామని అందరూ అనుకుంటారు. కాని ఇక్కడ పెళ్లి కూతురు ఒక యాచకురాలు కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో అనిల్ అనే యువకుడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో కూలీలు, పేదలు తినడానికి కూడా తిండిలేక […]
కరోనా కష్టకాలం ఎందరినో కుటుంబాలకు దూరంగా ఉంచుతుంటే.. ఈ యువకుడికి మాత్రం పెళ్లి చేసింది. లాక్‌డౌన్ సమయంలో చూసిన అమ్మాయిపై ప్రేమ పెంచుకొని చివరకు పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. సాధారణంగా ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లు చూసే ఉంటామని అందరూ అనుకుంటారు. కాని ఇక్కడ పెళ్లి కూతురు ఒక యాచకురాలు కావడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో అనిల్ అనే యువకుడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో కూలీలు, పేదలు తినడానికి కూడా తిండిలేక ఇబ్బందులు పడుతుండటంతో.. వారి కోసం అప్పుడప్పుడు రొట్టెలు తీసుకెళ్లి పంచుతుండేవాడు. అలా ఒక రోజు ఒక బ్రిడ్జి కింద ఉన్న యాచకులకు ఫుడ్ ప్యాకెట్లు పంచుతుండగా అక్కడ నీలం అనే అమ్మాయిని చూశాడు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన నీలం.. తన మేనమామ దగ్గర ఉంటూ బతుకీడుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో పనులు లేకపోవడంతో యాచిస్తూ బతుకుతోంది. అనిల్ ఆమెను చూసి మనసుపడ్డాడు. తనను పెండ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. దీనికి నీలం కూడా ఒప్పుకుంది. ఆ వెంటనే విషయాన్ని అనిల్ తన యజమాని లలిత్‌కు చెప్పాడు.
దీంతో లలిత్ వారి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఇరువైపుల పెద్దలకు చెప్పి ఒప్పించాడు. వారిద్దరికి అవసరమైన ఏర్పాట్లు చేశాడు. దీంతో ఇటీవలే ఈ జంట పెండ్లి చేసుకుంది. కష్టంలో ఉన్న నీలంను పెళ్లి చేసుకోవడం పట్ల ప్రజలు అనిల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘తానేం గొప్ప పని చేయలేదని.. తనకు నచ్చిన అమ్మాయినే పెండ్లి చేసుకున్నానని.. నీలం కష్టపడుతోన్న తీరు తనకు ఎంతగానో నచ్చిందని’ అనిల్ చెప్పాడు.