Telugu Global
National

నాగబాబు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు " పవన్‌

నటుడు నాగబాబు చేస్తున్న వివాదాస్పద ట్వీట్లపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. నాగబాబు గాడ్సేకు జై కొట్టడం, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మే కాకుండా ఇతర నాయకుల చిత్రాలు చూడాలనుకుంటున్నానంటూ నాగబాబు ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో దుమారం రేగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మనసు గెలిచి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు, పవన్‌ కల్యాణ్‌కు సపోర్టుగా నాగబాబు ఇలా గాడ్సే లైన్‌ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌కు పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని […]

నాగబాబు వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు  పవన్‌
X

నటుడు నాగబాబు చేస్తున్న వివాదాస్పద ట్వీట్లపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఎట్టకేలకు స్పందించారు.

నాగబాబు గాడ్సేకు జై కొట్టడం, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మే కాకుండా ఇతర నాయకుల చిత్రాలు చూడాలనుకుంటున్నానంటూ నాగబాబు ట్వీట్లు చేస్తున్న నేపథ్యంలో దుమారం రేగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ మనసు గెలిచి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు, పవన్‌ కల్యాణ్‌కు సపోర్టుగా నాగబాబు ఇలా గాడ్సే లైన్‌ తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్‌కు పవన్ కల్యాణ్ స్పందించారు.

నాగబాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని పవన్ ప్రకటించారు. జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ.. పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేస్తున్నానన్నారు.

‘జనసేన పార్టీలో లక్షలాదిగా వున్న కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలే గానీ.. పార్టీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేస్తున్నా. గతంలో కూడా మీడియా ద్వారా ఇదే విషయాన్ని చెప్పాను. ఈ మధ్య కాలంలో కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన కొందరు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు సోషల్‌ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవి. పార్టీకి ఎటువంటి సంబంధంలేదు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక పత్రం ద్వారా మాత్రమే వెల్లడిస్తాం. కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని పార్టీ కార్యకర్తలను కోరుతున్నాను. ఎవరూ కూడా క్రమశిక్షణను అతిక్రమించవద్దు’ అంటూ పవన్ కల్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు.

వ్యక్తిగత అభిప్రాయాలతో జనసేనకు సంబంధం లేదు – JanaSena Chief Sri #PawanKalyan

Publiée par JanaSena Party sur Samedi 23 mai 2020

First Published:  23 May 2020 10:41 AM IST
Next Story