Telugu Global
NEWS

ఎన్‌డీ టీవీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

ప్రముఖ జాతీయ చానల్‌ ఎన్‌డీటీవీతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఎన్‌డీటీవీ సేవలను ఏపీ ప్రభుత్వం వాడుకోబోంది. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేశారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రంగాల్లో విద్యా రంగం కూడా ఒకటిగా ఉంది. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రోజుకో రకంతో అత్యంత నాణ్యమైన ఆహారాన్ని […]

ఎన్‌డీ టీవీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
X

ప్రముఖ జాతీయ చానల్‌ ఎన్‌డీటీవీతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఎన్‌డీటీవీ సేవలను ఏపీ ప్రభుత్వం వాడుకోబోంది. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేశారు.

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రంగాల్లో విద్యా రంగం కూడా ఒకటిగా ఉంది. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రోజుకో రకంతో అత్యంత నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారు. నాడు- నేడు పేరుతో స్కూళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అదే సమయంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ అంశంలో ప్రతిపక్షాల నుంచి, హైకోర్టు నుంచి ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొంటోంది. పేరెంట్స్ కమిటీల తీర్మానాల ఆధారంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని సమర్థించలేమంటూ ఇటీవల హైకోర్టు ప్రభుత్వ జీవోను కొట్టివేసింది. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రుల నుంచి నేరుగా అభిప్రాయసేకరణ చేసింది. అందులో 96.17 శాతం మంది ఇంగ్లీష్ మీడియంకే ఓటేశారు.

ఇప్పుడు థర్డ్ పార్టీ సర్వేకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రముఖ జాతీయ న్యూస్ చానల్‌ ఎన్‌డీ టీవీ… ఇటీవల ఏపీ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పెట్టింది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే అంశంపై అభిప్రాయసేకరణ చేస్తామని ప్రతిపాదించింది. ఓపినియన్ పోల్‌తో పాటు ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొస్తున్న మార్పులపై ఏడు షార్ట్ ఫిల్మ్‌లను చిత్రీకరిస్తామని ఏపీ ప్రభుత్వానికి ఎన్‌డీటీవీ ప్రతిపాదించింది.

ఈ ప్రతిపాదనకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈమేరకు జీవోను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై ఒక ప్రతిష్టాత్మక సంస్థ ద్వారా థర్డ్ పార్టీ సర్వే అవసరం ఉందని భావిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. దానితో పాటు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొస్తున్న మార్పులపై షార్ట్ ఫిల్మ్‌లు చేస్తామన్న ఎన్‌డీ టీవీ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

First Published:  22 May 2020 4:30 AM IST
Next Story