Telugu Global
International

వైరస్ పరివర్తన చెందుతోంది " చైనా డాక్టర్లు

చైనాలోని వూహాన్‌లో ఉద్భవించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతటా పాకింది. పలు దేశాల్లో ఉధృతంగా వ్యాపిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ ప్రాంతాన్ని బట్టి పరివర్తన చెందుతోందా అనే అనుమానాలు మొదటి నుంచీ ఉన్నాయి. తాజాగా చైనా వైద్య నిపుణులు వైరస్ పరివర్తనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ చైనాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రభావం చూపిస్తోందని తేల్చి చెప్పారు. వూహాన్‌లో కంటే ఈశాన్య చైనా ప్రాంతంలో నమోదవుతున్న కేసుల్లో వైరస్ విభిన్నంగా ప్రవర్తిస్తోందని చెప్పారు. జిలిన్, హైలోంగ్ […]

వైరస్ పరివర్తన చెందుతోంది  చైనా డాక్టర్లు
X

చైనాలోని వూహాన్‌లో ఉద్భవించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతటా పాకింది. పలు దేశాల్లో ఉధృతంగా వ్యాపిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్ ప్రాంతాన్ని బట్టి పరివర్తన చెందుతోందా అనే అనుమానాలు మొదటి నుంచీ ఉన్నాయి. తాజాగా చైనా వైద్య నిపుణులు వైరస్ పరివర్తనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైరస్ చైనాలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ప్రభావం చూపిస్తోందని తేల్చి చెప్పారు.

వూహాన్‌లో కంటే ఈశాన్య చైనా ప్రాంతంలో నమోదవుతున్న కేసుల్లో వైరస్ విభిన్నంగా ప్రవర్తిస్తోందని చెప్పారు. జిలిన్, హైలోంగ్ జియాంగ్ ప్రావిన్సుల్లో కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడ వైరస్‌పై పరిశోధనలు జరిగాయి. ఈ ప్రాంతంలోని వైరస్ ఇంకుబేషన్ కాలంలో వూహాన్ రోగుల కంటే ఎక్కువ రోజులు ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఇక్కడ కోవిడ్-19 వ్యాధి త్వరగా బయటపడటం లేదని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ సభ్యుడు క్యూ హైబో తెలిపారు.

కరోనా వైరస్ తాజా పరివర్తన కారణంగా మానవాళికి మరింత ప్రమాదం జరుగుతోందని అన్నారు. ఇది త్వరగా మనుషుల్లో లక్షణాలను చూపించకపోవడంతో కుటుంబ సభ్యులకు కూడా వ్యాపిస్తోంది. దాంతో కొన్ని రోజుల్లోనే కుటుంబం మొత్తం వైరస్ బారిన పడుతోందని ఆయన వివరించారు. వూహాన్ వైరస్ స్థానికమైనదని.. కానీ ఈశాన్య చైనాలో ప్రభావం చూపిస్తున్న వైరస్ విదేశీ ప్రయాణికుల నుంచి ఇక్కడకు వచ్చిందని ఆయన అన్నారు.

పరివర్తన చెందిన వైరస్ ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోందని అన్నారు. వూహాన్ వైరస్ శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాగా, ఈశాన్య చైనాకు వచ్చిన రోగి ఏ దేశం నుంచి తిరిగి వచ్చాడు. ఇది ఏ దేశంలో పరివర్తన చెందిందనే విషయాన్ని మాత్రం అధికారులు బయటకు వెల్లడించలేదు. కాగా, ఈ ప్రాంతాలు ఉత్తరకొరియా, రష్యాలకు దగ్గరగా ఉండటం గమనార్హం.

First Published:  21 May 2020 7:52 AM IST
Next Story