Telugu Global
NEWS

పోతిరెడ్డిపాడును కట్టింది నేనే...

హైదరాబాద్‌ ను ప్రపంచపటంలో పెట్టడం నుంచి సెల్‌ఫోన్లు తీసుకురావడం వరకు అన్ని తానే చేశానని ఏమాత్రం మొహమాటపడకుండా బహిరంగ వేదికలపైనే చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు… ఇప్పుడు పోతిరెడ్డిపాడును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. పోతిరెడ్డిపాడును నిర్మించింది తానేనని ప్రకటించుకున్నారు. ఎన్‌టీఆర్‌ ప్రారంభిస్తే దాన్ని తాను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోతిరెడ్డిపాడు అంశంపై తానేమీ మౌనంగా లేనని… రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశంపార్టీకి మాత్రమే ఉందని వాదించారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులన్నీ […]

పోతిరెడ్డిపాడును కట్టింది నేనే...
X

హైదరాబాద్‌ ను ప్రపంచపటంలో పెట్టడం నుంచి సెల్‌ఫోన్లు తీసుకురావడం వరకు అన్ని తానే చేశానని ఏమాత్రం మొహమాటపడకుండా బహిరంగ వేదికలపైనే చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు… ఇప్పుడు పోతిరెడ్డిపాడును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. పోతిరెడ్డిపాడును నిర్మించింది తానేనని ప్రకటించుకున్నారు. ఎన్‌టీఆర్‌ ప్రారంభిస్తే దాన్ని తాను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

పోతిరెడ్డిపాడు అంశంపై తానేమీ మౌనంగా లేనని… రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశంపార్టీకి మాత్రమే ఉందని వాదించారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులన్నీ తానే నిర్మించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అయితే ముచ్చమర్రి ప్రాజెక్టు రాయలసీమకు జీవనాడి అని తాను ఆనాడే చెప్పానని జూమ్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పుష్కలంగా నీరు వచ్చినా అనంతపురం జిల్లాలకు నీరుఅందించలేకపోయారని చంద్రబాబు విమర్శించారు.

నిజానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని వైఎస్ ప్రభుత్వం 11 వేల క్యూసెక్కుల నుంచి 40వేల క్యూసెక్కులకు పెంచే పనులు మొదలుపెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఆదేశాలతో దేవినేని ఉమా పెద్దెత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. అటు తెలంగాణ టీడీపీ నేతలు ధర్నాలు చేశారు.

First Published:  21 May 2020 2:10 AM IST
Next Story