ప్రభుత్వానికి తలనొప్పిగా రంగుల వ్యవహారం
ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య రంగుల విషయంలో పొంతన కుదరడం లేదు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రంగులకు సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేస్తారా లేక కోర్డు ధిక్కరణ కింద పరిగణించమంటారో స్పష్టం చేయాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. వైసీపీ జెండా రంగులకు పోలిన రంగులను మార్చాలని గతంలో హైకోర్టు ఆదేశించగా… కొన్ని మార్పులతో ఆదేశాలను […]
ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య రంగుల విషయంలో పొంతన కుదరడం లేదు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ జెండాను పోలిన రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. రంగులకు సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేస్తారా లేక కోర్డు ధిక్కరణ కింద పరిగణించమంటారో స్పష్టం చేయాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ జెండా రంగులకు పోలిన రంగులను మార్చాలని గతంలో హైకోర్టు ఆదేశించగా… కొన్ని మార్పులతో ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. ఆకుపచ్చ, నీలం, తెలుపు రంగులకు అదనంగా ఎర్రమట్టి రంగును వేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని కూడా సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఏ పార్టీకి సంబంధం లేని రంగులు వేయాలని గతంలో హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం కావాలనే పార్టీ రంగులకు అదనంగా ఎర్రమట్టి రంగును వేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని పిటిషనర్ వాదించారు.
ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి పిటిషనర్ వాదనను తప్పుపట్టారు. ఏరంగువేసినా దాన్ని పార్టీలకు ఆపాదించడం సరైనది కాదన్నారు. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులకు, వైసీపీ జెండా రంగులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇరువురి వాదనను విన్న హైకోర్టు… రంగులపై జారీ చేసిన జీవోను రద్దు చేస్తారా లేక కోర్టు ధిక్కరణ కింద చర్యలుతీసుకోవాలో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.