కోవిడ్-19 రోగులతో శ్మశానంలా మారిన ప్రజా వైద్యశాల
దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. మహరాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా కేసులు గుజరాత్ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రజా వైద్యశాల ఆసియాలో అతి పెద్దదిగా పేరు తెచ్చుకుంది. అయిదే, ఇప్పుడు దాని పేరు కోవిడ్-19 శ్మశానవాటిక అని పిలవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఈ ఆసుపత్రికి వచ్చే కోవిడ్-19 రోగుల్లో.. కోలుకునేవారి కంటే చనిపోయే వారు అధికంగా ఉండటమే. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మార్చి నుంచి మే 19 వరకు పొందుపరిచిన కరోనా వైరస్‌కు […]
దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. మహరాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా కేసులు గుజరాత్ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప్రజా వైద్యశాల ఆసియాలో అతి పెద్దదిగా పేరు తెచ్చుకుంది. అయిదే, ఇప్పుడు దాని పేరు కోవిడ్-19 శ్మశానవాటిక అని పిలవాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఈ ఆసుపత్రికి వచ్చే కోవిడ్-19 రోగుల్లో.. కోలుకునేవారి కంటే చనిపోయే వారు అధికంగా ఉండటమే.
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మార్చి నుంచి మే 19 వరకు పొందుపరిచిన కరోనా వైరస్‌కు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. అసర్వాలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అత్యధిక మరణాలు సంభవించాయి. ఇక్కడ 343 మంది మరణించగా 338 మంది కోలుకున్నారు. ఏలీస్ బ్రిడ్జ్‌లో ఉన్న ఎస్‌వీపీ ఆసుపత్రి కాస్త నయంగా కనిపిస్తోంది. ఇక్కడ 884 మంది రోగులు కోలుకోగా 117 మరణాలు సంభవించాయి.
మిగిలిన ఆసుపత్రులతో పోల్చుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు ఎక్కువగా సంభవిస్తుండటంతో.. కొత్తగా చేరే రోగుల్లో ఆందోళన నెలకొంది. అక్కడ సిబ్బంది కొరత ఉండటంతో పాటు వైద్యులు కూడా అనేక పిర్యాదులు చేస్తున్నారు. రోగులకు ఇవ్వడానికి ఔషధాలు లేవని, రోగికి ట్రీట్మెంట్ అందించే సరైన పద్దతులు పాటించడం లేదని, నర్సింగ్ స్టాఫ్ కూడా తక్కువగా ఉండటంతో అందరిపై దృష్టి సారించలేకపోతున్నట్లు తెలుపుతున్నారు.
కోవిడ్-19 రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు కొన్నారు. స్థానిక మార్కెట్ నుంచి కొన్న వెంటిలేటర్లు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. దీంతో రోగులకు శ్వాస సంబంధిత సమస్యలు పెరిగిపోయాయి. మరణాల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా వైద్యులు చెబుతున్నారు.
ఇతర ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్న కోవిడ్ – 19 రోగుల్లో… ఎవరికైనా పరిస్థితి మరింత విషమంగా మారితే వారిని ఈ ఆసుపత్రికే మారుస్తున్నారు. దీంతో ఇక్కడ మరణాల సంఖ్య పెరిగిపోతోంది.
ప్రైవేటు ఆసుపత్రులు, సోలా సివిల్ ఆసుపత్రి ఇలాంటి రోగులనందరినీ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికే తరలిస్తున్నారని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఈ ఆసుపత్రిలో మరణాలు ఎక్కువగా సంభవిస్తుండటంతో దీన్ని ‘శ్మశానం’ అని పిలుస్తారేమో.
అయితే ఇక్కడ ఎక్కువ మరణాలకు కారణం… వయసు పైబడిన వాళ్లే అధికంగా ఇక్కడ చేరుతుండటం అని డాకర్ట్ ఎంఎం ప్రభాకర్ అన్నారు. అంతే కాకుండా చాలా మంది రోగులు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, పరిస్థితి విషమంగా ఉన్నప్పుడే చేరుతుండటంతో వారిని రక్షించలేకపోతున్నామన్నారు.