గాడ్సేకు జై కొట్టిన నాగబాబు
జాతిపిత మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేకు జై కొట్టారు జనసేన నేత, బుల్లితెర నటుడు నాగబాబు. గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అని నాగబాబు ట్వీట్ చేశారు. గాడ్సే నిజమైన దేశభక్తుడని… కానీ అప్పట్లో మీడియా ఆయన వాదనను వినిపించలేదన్నారు. అందుకే అతడో పెద్ద నేరస్తుడిగా చరిత్రలో మిగిలిపోయారన్నారు. గాంధీని చంపితే అపఖ్యాతి తప్పదని తెలిసి కూడా గాడ్సే ఆ పని చేశారంటే అందుకు ఉన్న బలమైన కారణాలను కూడా చర్చించాలన్నారు. గాంధీని చంపడాన్ని […]
జాతిపిత మహాత్మ గాంధీని హత్య చేసిన గాడ్సేకు జై కొట్టారు జనసేన నేత, బుల్లితెర నటుడు నాగబాబు. గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అని నాగబాబు ట్వీట్ చేశారు. గాడ్సే నిజమైన దేశభక్తుడని… కానీ అప్పట్లో మీడియా ఆయన వాదనను వినిపించలేదన్నారు. అందుకే అతడో పెద్ద నేరస్తుడిగా చరిత్రలో మిగిలిపోయారన్నారు. గాంధీని చంపితే అపఖ్యాతి తప్పదని తెలిసి కూడా గాడ్సే ఆ పని చేశారంటే అందుకు ఉన్న బలమైన కారణాలను కూడా చర్చించాలన్నారు.
గాంధీని చంపడాన్ని తానేమీ సమర్థించడం లేదని… కానీ గాడ్సే అలా ఎందుకు చేశారన్న దానిపై చర్చ జరగాలన్నదే తన ఉద్దేశం అని చెప్పారు. అప్పట్లోనూ మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా వాదన వినిపించిందన్నారు. గాడ్సేను చూస్తుంటే తనకు ఆయనపై జాలి కలుగుతోందన్నారు. భావప్రకటనా స్వేచ్చ ఉందని… అందుకే తాను గాడ్సే నిజమైన దేశభక్తుడు అని చెబుతున్నానన్నారు.
నాథురాం గాడ్సే ఏమీ క్రిమినల్ కాదని నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఎందుకు ఇప్పుడే ఎందుకు ట్వీట్ చేశారని ఒక చానల్ ప్రశ్నించగా… తనకు భావ ప్రకటన స్వేచ్చ ఉందన్నారు. తనపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చేసుకోనియండి అని స్పష్టం చేశారు.