Telugu Global
Cinema & Entertainment

మందు కొడుతూ సినిమా చూడొచ్చా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న టాపిక్ ఇదే. లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్ల వైపు తిరిగి ప్రేక్షకుల్ని రప్పించాలంటే.. సినిమా హాల్స్ లో లిక్కర్ ను అందుబాటులో ఉంచాల్సిందేనంటూ కొంతమంది వాదిస్తున్నారు. మరికొంతమంది మాత్రం అలా చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు పూర్తిగా దూరమైపోతారని మరికొందరు చెబుతున్నారు. ఈ మొత్తం చర్చకు ఆద్యుడు దర్శకుడు నాగ్ అశ్విన్. అవును.. నాగ్ అశ్విన్ పెట్టిన ఒకే ఒక్క ట్వీట్ తో ఈ […]

మందు కొడుతూ సినిమా చూడొచ్చా!
X

ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తున్న టాపిక్ ఇదే. లాక్ డౌన్ కారణంగా మూతపడిన థియేటర్ల వైపు తిరిగి ప్రేక్షకుల్ని రప్పించాలంటే.. సినిమా హాల్స్ లో లిక్కర్ ను అందుబాటులో ఉంచాల్సిందేనంటూ కొంతమంది వాదిస్తున్నారు. మరికొంతమంది మాత్రం అలా చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు పూర్తిగా దూరమైపోతారని మరికొందరు చెబుతున్నారు. ఈ మొత్తం చర్చకు ఆద్యుడు దర్శకుడు నాగ్ అశ్విన్.

అవును.. నాగ్ అశ్విన్ పెట్టిన ఒకే ఒక్క ట్వీట్ తో ఈ చర్చ మొత్తం మొదలైంది. “ఆమధ్య సురేష్ బాబు, రానా, నేను కలిసి మాట్లాడుకున్నాం. థియేటర్లు మళ్లీ తెరిస్తే ప్రేక్షకుల్ని ఆకర్షించడం ఎలా, థియేటర్లు కూడా లిక్కర్ లైసెన్స్ తెచ్చుకుంటే బాగుంటుందా.. ఇలా చేస్తే ఆడియన్స్ థియేటర్లకు వస్తారా.. లాంటి అంశాలు మాట్లాడుకున్నాం. దీనిపై మీరేమంటారు” అంటూ ఓ ప్రశ్న సంధించాడు.

అదిగో అప్పట్నుంచి ఈ చర్చ మొదలైంది. థియేటర్లలో కూడా మద్యం అందుబాటులోకి తీసుకురావాలంటూ మందు బాబుల డిమాండ్ మొదలైంది. నిజానికి ఇది కొత్తగా పుట్టికొచ్చింది కాదు. విదేశాల్లో ఈ కల్చర్ ఉంది. థియేటర్ ప్రాంగణంలోనే మద్యం కొనుక్కొని, సీట్లో కూర్చొని సినిమా చూడొచ్చు. ఇండియాలోకి మాత్రం ఈ పద్ధతి ఇంకా రాలేదు. లాక్ డౌన్ తర్వాత కొన్ని మల్టీప్లెక్సుల్లో ఈ పద్ధతి అందుబాటులోకి వస్తుందేమో చూడాలి.

First Published:  17 May 2020 3:30 PM IST
Next Story