కరోనా వ్యాక్సిన్ ధర తక్కువే " ప్రొఫెసర్ అడ్రియాన్ హిల్
ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ రూపొందించడమే పరిష్కారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ కోతులపై సత్ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపై పడింది. అస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీతో కలిసి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ల్యాబ్‌లో జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను రూపొందిస్తోంది. కాగా, ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించారు. తీరా […]
ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ రూపొందించడమే పరిష్కారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ కోతులపై సత్ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపై పడింది. అస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీతో కలిసి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ల్యాబ్‌లో జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను రూపొందిస్తోంది.
కాగా, ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించారు. తీరా ఇది మార్కెట్లో అందుబాటులో వచ్చిన తర్వాత ఎంత ధర ఉంటుంది..? సామాన్యుడు ఆ ధరను భరించగలడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఈ వ్యాక్సిన్ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ వ్యాక్సిన్ ధరపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోతులపై సింగిల్ డోస్ ఇచ్చిన తర్వాత కేవలం 14 రోజుల్లోనే అవి వైరస్‌తో పోరాడే యాంటీబాడీస్‌ను రూపొందిచాయనీ, 28 రోజుల తర్వాత వైరస్‌ను పూర్తిగా నాశనం చేయగలిగాయని చెప్పారు. మనుషులపై కూడా ప్రయోగం విజయవంతమయితే.. భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనీ, అంతేకాకుండా డిమాండ్ మేరకు సరఫరా చేయగలిగితే ధర అందుబాటులో ఉంటుందని తెలిపారు.
సామాన్యులు భయపడాల్సిన అవసరం లేదని, తక్కువ ధరకే కరోనా వైరస్ వ్యాక్సిన్ లభించబోతోందని చెప్పారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన 10 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఆగస్టు చివరి నాటికి మనుషులపై జరిపిన ప్రయోగాల ఫలితాలు వస్తాయనీ, ఆ తర్వాత ఫార్మా కంపెనీల ద్వారా ఉత్పత్తి చేయొచ్చని స్పష్టం చేశారు.