Telugu Global
Cinema & Entertainment

ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోనట్టే!

తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రతి మినహాయింపు సీఎం కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి థియేటర్లు తెరుస్తారా? తెరవరా? అనే అంశం కూడా కేసీఆర్ ముందుకెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంపై అంత ఆసక్తి చూపించినట్టు లేదు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాటల్లో అది స్పష్టమైంది. రాష్ట్రంలో మరో 2-3 నెలల పాటు సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదంటూ బాంబ్ […]

ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోనట్టే!
X

తెలంగాణలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రతి మినహాయింపు సీఎం కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి థియేటర్లు తెరుస్తారా? తెరవరా? అనే అంశం కూడా కేసీఆర్ ముందుకెళ్లినట్టు తెలుస్తోంది.

అయితే ముఖ్యమంత్రి మాత్రం ఈ విషయంపై అంత ఆసక్తి చూపించినట్టు లేదు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాటల్లో అది స్పష్టమైంది.

రాష్ట్రంలో మరో 2-3 నెలల పాటు సినిమా హాళ్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదంటూ బాంబ్ పేల్చారు తలసాని. నిజానికి ఈ నెలాఖరుతో లాక్ డౌన్ ముగుస్తుంది. మరోసారి పొడిగించినప్పటికీ.. జూన్ నెలాఖరు నుంచి థియేటర్లు తెరుచుకుంటాయని సినీజనాలు భావించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ అంశం గురించి ఇప్పట్లో ఆలోచించేలా కనిపించడం లేదు.

మరోవైపు షూటింగ్స్ పై కూడా సందిగ్దత కొనసాగుతోంది. థియేటర్లు తెరవకపోయినా కనీసం షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తే.. ఇండస్ట్రీ కాస్త తేరుకుంటుందనేది సినీపెద్దల మాట. దీనిపై కూడా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు తలసాని. చూస్తుంటే.. ఆగస్ట్ నెలాఖరు వరకు సినిమా హాళ్లు తెరుచుకునేలా లేవు.

First Published:  16 May 2020 6:28 AM GMT
Next Story