ఎట్టకేలకు ఈ దర్శకుడికి మరో ఛాన్స్
శ్రీవాస్.. డైరక్టర్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్న దర్శకుడు ఇతడు. మధ్యమధ్యలో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక ఫ్లాప్ దర్శకుడిగా మిగిలిపోయాడు. ఇప్పుడీ డైరక్టర్ కు మరో ఛాన్స్ వచ్చింది. ఈసారి కూడా అది మంచి అవకాశమే. నిర్మాత డీవీవీ దానయ్య తనయుడ్ని హీరోగా పరిచయం చేసే అవకాశం శ్రీవాస్ కు దక్కింది. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ.. శ్రీవాస్ చెప్పిన స్టోరీ దానయ్యకు బాగా నచ్చింది. అందుకే కొడుకు భవిష్యత్తును తీసుకెళ్లి శ్రీవాస్ చేతిలో పెట్టాడు. […]
శ్రీవాస్.. డైరక్టర్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్న దర్శకుడు ఇతడు. మధ్యమధ్యలో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక ఫ్లాప్ దర్శకుడిగా మిగిలిపోయాడు. ఇప్పుడీ డైరక్టర్ కు మరో ఛాన్స్ వచ్చింది. ఈసారి కూడా అది మంచి అవకాశమే.
నిర్మాత డీవీవీ దానయ్య తనయుడ్ని హీరోగా పరిచయం చేసే అవకాశం శ్రీవాస్ కు దక్కింది. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ.. శ్రీవాస్ చెప్పిన స్టోరీ దానయ్యకు బాగా నచ్చింది. అందుకే కొడుకు భవిష్యత్తును తీసుకెళ్లి శ్రీవాస్ చేతిలో పెట్టాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది.
శ్రీవాస్ చేసిన సాక్ష్యం సినిమా ఫ్లాప్ అయింది. బాలయ్యతో చేసిన డిక్టేటర్ మూవీ కూడా ఫ్లాప్ అయింది. రెండు సినిమాలూ అతడికి మంచి అవకాశాలే. కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు డీవీవీ దానయ్య ఆఫర్ కూడా మంచి ఛాన్స్. మరి ఈసారైనా శ్రీవాస్ తన కెరీర్ ను నిలబెట్టుకుంటాడేమో చూడాలి.