Telugu Global
International

విజయ్ మాల్యాకు ఉచ్చు బిగించిన ఈ అధికారి ఎవరో తెలుసా..?

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దేశంలోని బ్యాంకులను రూ.10వేల కోట్ల మేరా ముంచేసి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. గత నాలుగేండ్లుగా లండన్‌లోనే ఉంటున్న విజయ్ మాల్యా.. తొలుత ఈ భారీ కుంభకోణం నుంచి తప్పించుకోవాలని చూశాడు. అయితే విజయ్ మాల్యాకు ఒక్క అవకాశం కూడా లేకుండా… అతడు చేసిన నేరాలన్నింటికీ పకడ్బంధీగా ఆధారాలు సేకరించి ఉచ్చు బిగించింది సీబీఐ. ‘నా బాకీలన్నీ చెల్లించేస్తాను.. నన్ను విడిచి పెట్టండి’ అని కాళ్ల బేరానికి తీసుకొని వచ్చింది సీబీఐలోని […]

విజయ్ మాల్యాకు ఉచ్చు బిగించిన ఈ అధికారి ఎవరో తెలుసా..?
X

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దేశంలోని బ్యాంకులను రూ.10వేల కోట్ల మేరా ముంచేసి లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. గత నాలుగేండ్లుగా లండన్‌లోనే ఉంటున్న విజయ్ మాల్యా.. తొలుత ఈ భారీ కుంభకోణం నుంచి తప్పించుకోవాలని చూశాడు. అయితే విజయ్ మాల్యాకు ఒక్క అవకాశం కూడా లేకుండా… అతడు చేసిన నేరాలన్నింటికీ పకడ్బంధీగా ఆధారాలు సేకరించి ఉచ్చు బిగించింది సీబీఐ.

‘నా బాకీలన్నీ చెల్లించేస్తాను.. నన్ను విడిచి పెట్టండి’ అని కాళ్ల బేరానికి తీసుకొని వచ్చింది సీబీఐలోని సుమన్ కుమార్ అనే అధికారి. 2015 నుంచి విజయ్ మాల్యా కేసులో తీవ్రంగా కష్టపడుతున్న ఈ అధికారి పట్టుదల కారణంగానే విజయ్ మాల్యా తప్పించుకోలేక బేల చూపులు చూస్తున్నాడు. ఇంతకూ ఈ సుమన్ కుమార్ ఎవరు..?

మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అండ్ సెక్యూరిటీ సెల్‌లో సుమన్ కుమార్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించే సమయంలో 2015లో విజయ్ మాల్యా ఫైల్ అతని వద్దకు వచ్చింది. అప్పటికే ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ. 900 కోట్లు రుణం తీసుకొని మోసం చేసినట్లు ఆ ఫైలులో ఉంది. కానీ అటు ఐడీబీఐ బ్యాంకు పోలీసు కేసు మాత్రం పెట్టలేదు. సుమన్ కుమారే బలమైన సాక్ష్యాలు సేకరించి బ్యాంకు ముందు ఉంచడంతో చివరకు మాల్యాపై కేసు నమోదైంది. ఇక ఆ తర్వాత ఒక బ్యాంకు వెంబటి మరోటి విజయ్ మాల్యాపై పిర్యాదులు చేయడం మొదలు పెట్టాయి.

అప్పటికే రాజ్యసభ సభ్యుడైన విజయ్ మాల్యా.. తన ప్రీమియర్ ఎయిల్‌లైన్స్ నష్టాల్లో ఉన్నట్లు చెప్పాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నడపటానికి వేల కోట్లు అప్పులు చేసినట్లు విచారణలో తేలింది. ఎస్బీఐ కన్సార్టియం నుంచి రూ.9000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లు కూడా సుమన్ విచారణలో తేలింది. దీంతో బలమైన సాక్ష్యాలు సేకరించడం మొదలు పెట్టాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మాల్యా 2016లో దేశం విడిచి వెళ్లిపోయాడు.

అప్పటికే కేసును సీబీఐకి కూడా అప్పగించారు. విజయ్ మాల్యా పారిపోవడానికి సీబీఐ సహకరించిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి అడిషనల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు దీని బాధ్యతలు అప్పగించారు. ఆయన సుమన్ కుమార్‌ను తన టీంలోకి తీసుకున్నారు. ఆనాటి నుంచి లండన్ కోర్టుల్లో సుమన్ స్వయంగా పిటిషన్లు వేశారు. విజయ్ మాల్యా కేసు విచారణకు వస్తుందంటే ఒక్క రోజు కూడా గైర్హాజరు కాకుండా చూశారు. వెస్ట్ మినిస్టర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతీ దశలో తమ వద్ద ఉన్న ఆధారాలతో మాల్యా దోషేనని నిరూపించడానికి ఎనలేని కృషి చేశారు.

సీబీఐ చూపిన తెగువ, విచారణ ఫలితంగా యూకే సుప్రీంకోర్టు మాల్యా అప్పగింతకు మార్గం సుగమమం చేసింది. తనను భారత్‌కు అప్పగించవద్దని పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం కొట్టేసింది. దీంతో 28 రోజుల లోపు అతడిని లండన్ నుంచి డీపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విజయానికి కారణం సుమన్ కుమారే అని సీబీఐ చెబుతోంది. పలువురు ఉన్నతాధికారుల నుంచి ఆయనకు ప్రశంసలు అందుతున్నాయి.

23 ఏండ్ల వయసులో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరిన సుమన్ కుమార్.. ఇవాళ సీబీఐలో అదనపు సూపరింటెండెంట్ ‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బ్యాంకులను మోసం చేసిన వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చు… కానీ అసాధ్యం కాదని… విజయ్ మాల్యా కేసులో సుమన్ కుమార్ నిరూపించారు.

First Published:  15 May 2020 6:13 AM IST
Next Story