Telugu Global
Cinema & Entertainment

పరిస్థితులన్నీ చక్కబడ్డాకే పెళ్ళట...!

దాదాపు ఒకే టైమ్ లో నితిన్, నిఖిల్ తమ ప్రేమ వ్యవహారాల్ని బయటపెట్టారు. దాదాపు ఒకే టైమ్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. లెక్కప్రకారం వీళ్ల పెళ్లిళ్లు కూడా ఒకే టైమ్ లో జరగాలి. కానీ లాక్ డౌన్ కారణంగా అటు నితిన్, ఇటు నిఖిల్ తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం ఆగలేదు. ఇప్పటికే ఓసారి పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్న ఈ హీరో.. లాక్ డౌన్ ఛాయలు, కరోనా బాధలు […]

పరిస్థితులన్నీ చక్కబడ్డాకే పెళ్ళట...!
X

దాదాపు ఒకే టైమ్ లో నితిన్, నిఖిల్ తమ ప్రేమ వ్యవహారాల్ని బయటపెట్టారు. దాదాపు ఒకే టైమ్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. లెక్కప్రకారం వీళ్ల పెళ్లిళ్లు కూడా ఒకే టైమ్ లో జరగాలి. కానీ లాక్ డౌన్ కారణంగా అటు నితిన్, ఇటు నిఖిల్ తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు.

అయితే నిఖిల్ మాత్రం ఆగలేదు. ఇప్పటికే ఓసారి పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్న ఈ హీరో.. లాక్ డౌన్ ఛాయలు, కరోనా బాధలు ఇంకొన్నాళ్లు తప్పవని గ్రహించాడు. అందుకే ప్రభుత్వం విధించిన నియమనిబంధనలు పాటిస్తూ గుంభనంగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అంతా ఇప్పుడు నితిన్ వైపు చూడడం మొదలుపెట్టారు.

నిఖిల్ తరహాలో నితిన్ కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లోనే షాలిని మెడలో మూడుముళ్లు వేస్తాడని చాలామంది అనుకుంటున్నారు. జూన్ నెలాఖరులోపు నితిన్ పెళ్లి అయిపోతుందని కూడా కొందరు చెప్పుకొచ్చారు. కానీ నితిన్ కుటుంబ సభ్యుల నుంచి మాత్రం వేరే వెర్షన్ వినిపిస్తోంది.

పెళ్లి కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయడానికే నితిన్ నిర్ణయించుకున్నాడట. ఇలా లాక్ డౌన్ టైమ్ లో పెళ్లి చేసుకొని, జీవితంలోని ఓ మధురమైన అనుభూతిని మిస్ అయ్యేకంటే.. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత అందరి సమక్షంలో ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడట. అటు షాలినీ కూడా నితిన్ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సో.. నితిన్ పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉందన్నమాట.

First Published:  15 May 2020 1:43 PM IST
Next Story