Telugu Global
National

18 నుంచి జిల్లాల్లో ఆంక్షల సడలింపు.... కేంద్రం నుంచి సంకేతాలు

మే 17తో లాక్‌డౌన్‌ పూర్తవుతుంది. నాల్గోసారి కొనసాగించేందుకు కేంద్రం రెడీగా ఉంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడగింపుపై సంకేతాలు పంపింది. మరో 18 లేదా 21 రోజులు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ఆంక్షలు సడలించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నాల్గో లాక్‌డౌన్‌ పీరియడ్‌లో కొంత వెసులుబాటు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే గ్రీన్‌జోన్‌లో ఆంక్షలు సడలించిన కేంద్రం… ప్రజా రవాణా ప్రారంభించేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. రాష్ట్రాల బ్లూ ప్రింట్‌ ఆధారంగా ప్రజా […]

18 నుంచి జిల్లాల్లో ఆంక్షల సడలింపు.... కేంద్రం నుంచి సంకేతాలు
X

మే 17తో లాక్‌డౌన్‌ పూర్తవుతుంది. నాల్గోసారి కొనసాగించేందుకు కేంద్రం రెడీగా ఉంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ పొడగింపుపై సంకేతాలు పంపింది. మరో 18 లేదా 21 రోజులు లాక్‌డౌన్‌ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొన్ని ఆంక్షలు సడలించాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ నాల్గో లాక్‌డౌన్‌ పీరియడ్‌లో కొంత వెసులుబాటు కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది.
ఇప్పటికే గ్రీన్‌జోన్‌లో ఆంక్షలు సడలించిన కేంద్రం… ప్రజా రవాణా ప్రారంభించేందుకు రాష్ట్రాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. రాష్ట్రాల బ్లూ ప్రింట్‌ ఆధారంగా ప్రజా రవాణా నడిచేందుకు కేంద్రం ఓకే చెప్పనుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో గ్రీన్‌జోన్‌లో బస్సులు, ఆటోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించాలని కోరాయి.

నాన్‌ హాట్‌ స్పాట్‌ జోన్లలో పరిమితమైన ప్రమాణికులతో ప్రజా రవాణా నడిపేందుకు కేంద్రం ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. గ్రీన్‌ జోన్‌ జిల్లాల్లో బస్సులు తిరిగేందుకు అనుమతి ఇస్తారని సమాచారం. ఆటోలు, టాక్సీలు కూడా నడిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నారు.

ట్రావెల్‌ పాస్‌లు ఉన్నవారికి ఇంటర్‌ స్టేట్‌ల మధ్య ప్రయాణించేందుకు కూడా అనుమతి ఇస్తారట. వచ్చేవారంలో దేశీయంగా కూడా విమాన ప్రయాణ అవకాశాలను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది.
అన్ని రకాల వస్తువుల హోండెలవరీ సర్వీస్ లను కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది.

హాట్‌స్పాట్‌లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని ఇటీవల ప్రధానమంత్రితో వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు కోరారు. ఈమేరకు ఈ అధికారం రాష్ట్రాలకు ఇచ్చేందుకు కేంద్రం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసులు బయటపడ్డ హాట్‌స్పాట్‌ ఏరియాలో మాత్రం పాత ఆంక్షలే కొనసాగుతాయి.

మహారాష్ట్రాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షల సడలింపు ఉండదని తెలుస్తోంది. ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా లేదని సమాచారం. దీంతో ఇక్కడ ప్రజా రవాణాతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా తెరుచుకునే అవకాశం లేదు.

గుజరాత్‌లో అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదరలాంటి అర్బన్‌ ఏరియాల్లోనే కరోనా వ్యాపించింది. ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల్లో 70 శాతం అహ్మదాబాద్‌నుంచి నమోదైనవే. దీంతో ఇక్కడ మినహా… మిగతా జిల్లాల్లో ఆంక్షల సడలింపు ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్నాటక, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాలు కేంద్రానికి క్లారిటీ ఇచ్చాయి. తమ రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నామని తెలిపాయి.

అయితే జార్ఖండ్‌, బీహార్‌, ఒడిషాలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ కొనసాగించేందుకే ఈ రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నాయి. మొత్తానికి రేపోమాపో ఆంక్షల సడలింపుపై కేంద్రహోంశాఖ నోట్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

First Published:  14 May 2020 10:50 PM GMT
Next Story