పెళ్లిపై స్పందించిన రామ్
టాలీవుడ్ లో చర్చ మొత్తం ఇప్పుడు పెళ్లిళ్ల చుట్టూ తిరుగుతోంది. మొన్నటివరకు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసిన హీరోలంతా మూకుమ్మడిగా ఒకేసారి పెళ్లిళ్లకు రెడీ అవుతున్నట్టున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో హీరోలకు వరుసగా పెళ్లిళ్లు జరిగేలా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో హీరో రామ్ కూడా తన పెళ్లిపై స్పందించాడు. ఈరోజు రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్.. పెళ్లిపై తనకు ఎలాంటి ప్లాన్స్ లేవని అంటున్నాడు. ప్రస్తుతానికి తను సింగిల్ […]
టాలీవుడ్ లో చర్చ మొత్తం ఇప్పుడు పెళ్లిళ్ల చుట్టూ తిరుగుతోంది. మొన్నటివరకు బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసిన హీరోలంతా మూకుమ్మడిగా ఒకేసారి పెళ్లిళ్లకు రెడీ అవుతున్నట్టున్నారు. రాబోయే 2-3 ఏళ్లలో హీరోలకు వరుసగా పెళ్లిళ్లు జరిగేలా ఉంది పరిస్థితి. ఈ క్రమంలో హీరో రామ్ కూడా తన పెళ్లిపై స్పందించాడు.
ఈరోజు రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రామ్.. పెళ్లిపై తనకు ఎలాంటి ప్లాన్స్ లేవని అంటున్నాడు. ప్రస్తుతానికి తను సింగిల్ గా ఉన్నానని, ఈ లైఫ్ చాలా బాగుందని చెబుతున్నాడు. అయినా ప్రేమ-పెళ్లి అనేది తన చేతిలో లేవని, అవి ఎప్పుడు ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతాయని వేదాంతం చెబుతున్నాడు.
రామ్ ఇలా చెప్పిన వెంటనే సోషల్ మీడియాలో అతడిపై సెటైర్లు పేలడం మొదలయ్యాయి. మొన్నటివరకు రానా ఇలానే చెప్పాడని, కట్ చేస్తే తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేశాడని చెప్పుకొచ్చారు. అంతకంటే ముందు నితిన్, నిఖిల్ కూడా సింగిల్ లైఫ్ సూపర్ అంటూ ఇచ్చిన స్టేట్ మెంట్స్ ను బయటకు తీశారు నెటిజన్లు.
సో.. రామ్ కూడా కబుర్లు చెబుతున్నాడని, ఏదో ఒక రోజు ఈమె తన గర్ల్ ఫ్రెండ్ అంటూ ఎవరో ఒక అమ్మాయిని జనాలకు చూపిస్తాడని చెబుతున్నారు.