Telugu Global
National

బడాబాబులు ఇప్పుడేమంటారో?

ప్రైవేట్ స్కూళ్లలోనూ తెలుగు మీడియం తప్పనిసరి చేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. గరీబ్‌ గైడ్ అనే సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఇంతకాలం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉండాల్సిందే అని గళమెత్తిన పెద్దలంతా… తెలుగు మీద అదే ప్రేమను కనబరుస్తూ తమ పిల్లలు చదివే, తాము నిర్వహించే ప్రైవేట్ […]

బడాబాబులు ఇప్పుడేమంటారో?
X

ప్రైవేట్ స్కూళ్లలోనూ తెలుగు మీడియం తప్పనిసరి చేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. గరీబ్‌ గైడ్ అనే సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

దీంతో ఇంతకాలం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియం ఉండాల్సిందే అని గళమెత్తిన పెద్దలంతా… తెలుగు మీద అదే ప్రేమను కనబరుస్తూ తమ పిల్లలు చదివే, తాము నిర్వహించే ప్రైవేట్ స్కూళ్లలోనూ తెలుగు మీడియంను స్వాగతిస్తారా? లేదా? అన్నది చూడాలి. కేవలం లాభాల కోసమే చదువులు చెప్పే కార్పొరేట్ , ప్రైవేట్ స్కూళ్లలో తెలుగును బలవంతం చేయడం సరికాదంటారో చూడాలి.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తమ స్కూళ్లకు గిరాకీ తగ్గుతుందన్న ఉద్దేశంతో కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంకు అడ్డుపడుతున్నాయన్న ఆరోపణ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో తెలుగు మీడియం తప్పనిసరిపై ఈ కార్పొరేట్ స్కూళ్లు ఎలా స్పందిస్తాయో… వారికి వత్తాసు పలికే పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. అన్నింటికి మించి మాతృభాష తప్పనిసరిగా ఉండాల్సిందే అని ప్రైవేట్ స్కూళ్ల విషయంలోనూ హైకోర్టు ఆదేశాలు ఇస్తుందేమో చూడాలి.

ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా… విపక్షాలు తీవ్రంగా అడ్డుపడ్డాయి. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేస్తూనే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం చెప్పినా లెక్కచేయలేదు. చివరకు కోర్టులకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు కాకుండా విపక్షాలు అడ్డుకున్నాయి.

ప్రభుత్వ స్కూళ్లలోని పేరెంట్స్ కమిటీ తీర్మానాల ఆధారంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం చట్టవిరుద్దమంటూ… హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేసింది. అయినప్పటికీ పట్టువీడని ప్రభుత్వం… ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరి నుంచి అభిప్రాయాలు సేకరించింది.

96. 17 శాతం మంది తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఉండాలని జై కొట్టారు. ఈ అభిప్రాయ సేకరణ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దు అంటున్న వారి పిల్లలంతా ప్రైవేట్ స్కూళ్లలో ఎంచక్కా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు.

పైగా ఈ బడాబాబుల పిల్లలు చదువుతున్న స్కూళ్లలో అసలు తెలుగు సబ్జెక్ట్ కూడా ఉండదు, తెలుగు అక్షరం ముక్క కనిపించదు.

ఇలా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను నిర్వహిస్తున్న వారిలో వెంకయ్యనాయుడు, రామోజీరావు లాంటి వారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మాత్రం ఏ వ్యవస్థ ప్రశ్నించే సాహసం చేయలేదు.

First Published:  15 May 2020 7:12 AM IST
Next Story