స్విగ్గీ ద్వారా ఇంటింటికీ మందు సీసా
ఇంటింటికీ ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థ కావలసిన ప్రతి వ్యక్తికీ ఇంటింటికే మద్యం సీసాలు సరఫరా చేయాలని సంకల్పించింది. ఇందుకోసం స్విగ్గీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆ సంస్థ ఉన్నతాధికారి వివేక్ సుందర్ చెప్పారు. ప్రజలు మద్యం కోసం వీధుల్లోకి వచ్చి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండాలంటే మద్యం కూడా ఇంటికే సరఫరా చేసే ప్రతిపాదన పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ప్రతిపాదనను పంజాబ్, మహారాష్ట్ర, […]

ఇంటింటికీ ఆహార పదార్థాలు సరఫరా చేసే సంస్థ కావలసిన ప్రతి వ్యక్తికీ ఇంటింటికే మద్యం సీసాలు సరఫరా చేయాలని సంకల్పించింది. ఇందుకోసం స్విగ్గీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆ సంస్థ ఉన్నతాధికారి వివేక్ సుందర్ చెప్పారు.
ప్రజలు మద్యం కోసం వీధుల్లోకి వచ్చి లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించకుండా ఉండాలంటే మద్యం కూడా ఇంటికే సరఫరా చేసే ప్రతిపాదన పరిశీలించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఈ ప్రతిపాదనను పంజాబ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, దిల్లీ, ఒరిస్సా రాష్ట్రాలు సూత్రప్రాయంగా ఆమోదించాయి. ఈ రాష్ట్రాలు స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలతో తో చర్చించాయి కూడా.
మద్యం దుకాణాల నుంచి స్విగ్గీ ఇంటింటికీ సరఫరా చేస్తుంది. మద్యం దుకాణాల వారు ప్రభుత్వానికి భారీ మొత్తంలో లైసెన్సు ఫీజు చెల్లిస్తారు. ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తే రాష్ట్రాల రెవెన్యూ వసూళ్లు పెరుగుతాయని, ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తమ పరిశోధనలో తేలిందని బడా మద్యం వ్యాపారి ఆర్యన్ సోలంకి తెలియజేశారు.