Telugu Global
Cinema & Entertainment

మళ్లీ సంక్రాంతికే వస్తున్న సూపర్ స్టార్

దాదాపు మూడేళ్ల నుంచి రజనీకాంత్ సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. ఈసారి కూడా రజనీకాంత్ సంక్రాంతినే టార్గెట్ చేశారు. అతడు నటిస్తున్న అన్నాత్తే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది. ఎప్పట్లానే రజనీకాంత్ సినిమాతోనే సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కీర్తిసురేష్, ఖుష్బూ, మీన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ […]

మళ్లీ సంక్రాంతికే వస్తున్న సూపర్ స్టార్
X

దాదాపు మూడేళ్ల నుంచి రజనీకాంత్ సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి. ఈసారి కూడా రజనీకాంత్ సంక్రాంతినే టార్గెట్ చేశారు. అతడు నటిస్తున్న అన్నాత్తే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది. ఎప్పట్లానే రజనీకాంత్ సినిమాతోనే సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది.

శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కీర్తిసురేష్, ఖుష్బూ, మీన హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోవడంతో.. సినిమా రిలీజ్ ను వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు. రజనీకాంత్ సినిమా సంక్రాంతికి వాయిదాపడిన విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.

ఇంతకుముందు రజనీకాంత్ నటించిన పేట సినిమా 2019 సంక్రాంతి కానుకగా వచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ చేసిన దర్బార్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చింది. ఇప్పుడు అన్నాత్తే సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతోంది.

First Published:  14 May 2020 5:00 AM IST
Next Story