Telugu Global
CRIME

లాక్ డౌన్ అమలులోనూ మత వివక్షే

కరోనా వ్యాధిని ఎదుర్కోవడం కోసం విధించిన లాక్ డౌన్ ను అమలు చేయడంలో నిమగ్నమైన పోలీసులు తమ అసహనాన్ని ముస్లింలపై ప్రదర్శించే ధోరణి మాత్రం విడనాడలేదు. గత శుక్రవారం (మే 8న)రోజున అహమాదాబాద్ లోని ముస్లింలు అధిక సంఖ్యలో నివసించే ఒక బస్తీలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ తరవాత పోలీసులు షాపూర్ ప్రాంతంలో ఎనిమిది నెలల గర్భవతి పొట్టలో లాఠీలతో పొడిచారు. ఆ మహిళ ముస్లిం మతస్థురాలు. ఆమె ఇంటి మీద పడి బీభత్సం సృష్టించారు. […]

లాక్ డౌన్ అమలులోనూ మత వివక్షే
X

కరోనా వ్యాధిని ఎదుర్కోవడం కోసం విధించిన లాక్ డౌన్ ను అమలు చేయడంలో నిమగ్నమైన పోలీసులు తమ అసహనాన్ని ముస్లింలపై ప్రదర్శించే ధోరణి మాత్రం విడనాడలేదు.

గత శుక్రవారం (మే 8న)రోజున అహమాదాబాద్ లోని ముస్లింలు అధిక సంఖ్యలో నివసించే ఒక బస్తీలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ తరవాత పోలీసులు షాపూర్ ప్రాంతంలో ఎనిమిది నెలల గర్భవతి పొట్టలో లాఠీలతో పొడిచారు. ఆ మహిళ ముస్లిం మతస్థురాలు. ఆమె ఇంటి మీద పడి బీభత్సం సృష్టించారు.

గర్భిణిపై ఈ కిరాతకానికి పాల్పడిన పోలీసులపై కఠిన చర్య తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ గుజరాత్ పోలీసు డైరెక్టర్ జనరల్ కు లేఖ రాసింది.

లాక్ డౌన్ విధించిన సమయంలో వీధుల్లోకి వచ్చే వారి పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పోలీసులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ గుజరాత్ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.

పోలీసుల ఆగడంతో భయభ్రాంతులైన మహిళలు

ఈ గర్భిణీపై పోలీసుల దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. పోలీసులు ఆమె ఇంట్లో చొరబడి తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లో వాళ్లను చికతకబాదారు.

ఇఫ్తార్ కు ముందు ముగ్గురు వ్యక్తులు తమ ఇళ్ల ముందు కూర్చుని ఉండగా పోలీసులు తమ ప్రతాపం ప్రదర్శించారని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధి గయాసుద్దీన్ షేక్ ధృవీకరించారు. షాపూర్ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉంది. మిగతా ప్రాంతాలకన్నా ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే చోట్ల పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో పాలు, ఔషధాలు మినహా పళ్లు, కూరగాయల అమ్మకాలను కూడా అనుమతించడం లేదు.

కొద్ది క్షణాల్లోనే అక్కడ అనేకమంది గుమిగూడారు. రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఇందులో ముగ్గురు పోలీసులు, మరో వ్యక్తి గాయపడ్డారు. జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

జనాన్ని అదుపు చేయడానికి మాత్రమే పోలీసులు పరిమితమై ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. మరుసటి రోజు పోలీసులు ఆ ప్రాంతంలోని సందుగొందుల్లో వీర విహారం చేసి కనిపించిన వారినల్ల చితక బాది 20 మందిని అరెస్టు చేశారు. పళ్లు, కూరగాయల కోసం బయటికి వచ్చిన ఇద్దరు మహిళలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల ఆగడాలు యూ ట్యూబులో స్వైర విహారం చేశాయి. గుజరాత్ టుడే అనే ఒకే ఒక పత్రికలో ఈ వార్త వచ్చించి. ఆ పత్రికా ఓ ముస్లిం యాజమాన్యంలోనిదే.

పోలీసులు విరగ్గొట్టిన తలుపు

ఆతిక్ కగ్డి అనే వ్యక్తి ఇంట్లోకి తలుపులు బద్దలు కొట్టి ప్రవేశించిన పోలీసులు బీభత్సం సృష్టించారు. ఖురాన్ చదువుతున్న ఇంటి యజమాని ఆతిక్ కగ్డి తల్లిని, శిశువుకు పాలిస్తున్న ఆయన భార్యను లాఠీలతో బాదారు. ఆయన తమ్ముడిని పట్టుకెళ్లారు.

మరో చోట అశక్తుడైన ఓ 65 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు ఇంట్లోంచి లాగి చితగ్గొట్టారు. ఆ వృద్ధుడు రాళ్లు విసిరాడని ఆరోపించారు. అశక్తుడైన వ్యక్తిని కొడుతున్న వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించిన మహిళ మీద కూడా విరుచుకుపడ్డారు.

First Published:  14 May 2020 5:15 AM IST
Next Story