ఈనాడు, జ్యోతి పట్టుకోల్పోతున్నాయి...
ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తన పాఠకులను కోల్పోతున్నాయి. సాక్షి మాత్రం మెల్లగా తన పాఠకుల సంఖ్యను పెంచుకుంటోంది. పత్రికలను పాఠకులు ఏ మేరకు ఆదరిస్తున్నారన్న దానిపై ఇండియన్ రీడర్‌షిప్ సర్వే … 2019-20 ఆఖరి త్రైమాసికానికి సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది. 2019-20 తొలి త్రైమాసికంలో ఈనాడు పాఠకుల సంఖ్య 82 లక్షల 51వేలుగా ఉంది. అయితే చివరి త్రైమాసికానికి వచ్చే సరికి 63 లక్షల 91వేలకు పడిపోయింది. 18లక్షల 60వేల మంది పాఠకులు ఈనాడుకు […]
ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తన పాఠకులను కోల్పోతున్నాయి. సాక్షి మాత్రం మెల్లగా తన పాఠకుల సంఖ్యను పెంచుకుంటోంది. పత్రికలను పాఠకులు ఏ మేరకు ఆదరిస్తున్నారన్న దానిపై ఇండియన్ రీడర్‌షిప్ సర్వే … 2019-20 ఆఖరి త్రైమాసికానికి సంబంధించిన రిపోర్టును విడుదల చేసింది.
2019-20 తొలి త్రైమాసికంలో ఈనాడు పాఠకుల సంఖ్య 82 లక్షల 51వేలుగా ఉంది. అయితే చివరి త్రైమాసికానికి వచ్చే సరికి 63 లక్షల 91వేలకు పడిపోయింది. 18లక్షల 60వేల మంది పాఠకులు ఈనాడుకు ఏడాదిలో దూరమయ్యారు.
ఈనాడు పాఠకుల సంఖ్య తగ్గిపోతుండగా సాక్షి మాత్రం పాఠకుల సంఖ్యను ఏడాదిలో పెంచుకుంది. 2019-20 తొలి త్రైమాసికంలో సాక్షి పాఠకుల సంఖ్య 52 లక్షల 38వేలుగా ఏపీలో ఉంది. ఆఖరి త్రైమాసికానికి వచ్చే సరికి సాక్షి పాఠకుల సంఖ్య 57 లక్షల 56వేలకు పెరిగింది.
ఏపీలో ఆంధ్రజ్యోతి మూడో స్థానంలో ఉంది. ఈ పత్రిక పాఠకుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. 2019-20 తొలి త్రైమాసికంలో ఆంధ్రజ్యోతి పాఠకుల సంఖ్య 38లక్షల 97 వేలుగా ఉంది. 2019-20 ఆఖరి త్రైమాసికానికి వచ్చే సరికి 30లక్షలకు పడిపోయింది. అంటే 8లక్షల మంది పాఠకులు ఆంధ్రజ్యోతికి దూరమయ్యారు.
రాయలసీమ ప్రాంతంలో సాక్షి పత్రిక అత్యధికంగా 59 శాతం పాఠకుల ఆదరణ సాధించింది. ఈనాడు పత్రిక రాయలసీమ జిల్లాల్లో 33 శాతం పాఠకులను కోల్పోయింది. ఏపీలో ఈనాడుకు, సాక్షికి మధ్య పాఠకుల సంఖ్య ప్రస్తుతం 6 లక్షల 35 వేలు తేడా ఉంది.