Telugu Global
NEWS

జూమ్‌ పార్టీ బాబు దొంగ... అందుకే అందరూ దొంగల్లా కనిపిస్తారు...

టీడీపీ, ఆ పార్టీ మీడియా ఎంతగా ఆరాటపడినా తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కలిసిపోయిందన్నారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు మంత్రులం గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఒకరోజు బస చేశామని చెప్పారు. బాధిత గ్రామాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. మరిన్ని రోజులు గ్రామస్తుల కోసం భోజన శిబిరాలను, ఇతర సహాయక శిబిరాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వివరించారు. ప్రతి బాధిత […]

జూమ్‌ పార్టీ బాబు దొంగ... అందుకే అందరూ దొంగల్లా కనిపిస్తారు...
X

టీడీపీ, ఆ పార్టీ మీడియా ఎంతగా ఆరాటపడినా తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కలిసిపోయిందన్నారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు మంత్రులం గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఒకరోజు బస చేశామని చెప్పారు. బాధిత గ్రామాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. మరిన్ని రోజులు గ్రామస్తుల కోసం భోజన శిబిరాలను, ఇతర సహాయక శిబిరాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వివరించారు.

ప్రతి బాధిత కుటుంబానికి పరిహారం అందజేయాల్సిందిగా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని… రెండు రోజుల్లో పరిహారం పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు లేనిపోనివి రాస్తున్నాయని… అలా రాసే వారిని వారి కర్మకే వదిలేస్తున్నామన్నారు మంత్రి బొత్స.

ఇంకా గ్రామాల్లో విషవాయువులు ఉన్నాయంటూ పాత వార్తలను ఈనాడు పత్రిక ప్రచురించి ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నించిందని బొత్స విమర్శించారు. ఈ వార్తలను పట్టుకుని టీడీపీ ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. టీడీపీ ఏపీ ప్రతిపక్ష పార్టీగా కాకుండా జూమ్ పార్టీగా మారిపోయిందన్నారు.

ఇదే ఘటన చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ఈపాటికి ప్రచారంతో హోరెత్తించి ఉండేవారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ప్రచారం గురించి ఆలోచించకుండా మౌనంగా పనిచేసుకుపోతోందన్నారు.

చివరకు టీడీపీ పరిస్థితి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలోని మాటల్లో ఒత్తులు, పొల్లులు ఆధారంగా విమర్శలు చేసే స్థాయికి దిగజారిపోయిందని బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెద్ద దొంగ కాబట్టి అందరూ కూడా అలాంటి దొంగపనులు చేస్తున్నారన్న భ్రమతో మాట్లాడుతున్నారని బొత్స విమర్శించారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోయి జూమ్‌ యాప్‌లో మాట్లాడే చంద్రబాబా రాష్ట్రం గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు.

రెండున్నర లక్షల కోట్ల అప్పును రాష్ట్రంపై వేసి వెళ్లిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతారని నిలదీశారు. కనీసం జిల్లాల్లోని టీడీపీ నేతలు కూడా బయటకు రాకుండా ఇళ్లలో దాక్కున్నారన్నారు. ఇళ్లలో దాక్కుని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల మాటలను టీడీపీ పత్రికలు భారీగా కవరేజ్ ఇస్తున్నాయన్నారు. ఏం చేసినా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అన్నది చరిత్రగా మారిపోయిందన్నారు.

First Published:  14 May 2020 8:40 AM IST
Next Story