Telugu Global
Cinema & Entertainment

పెళ్లి పనుల్లో పడిన సురేష్ బాబు

రానా ఇలా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడో లేదో అలా సురేష్ బాబు పెళ్లి పనుల్లో పడిపోయారు. అవును.. రానా పెళ్లి పనులు ప్రారంభించినట్టు సురేష్ బాబు ప్రకటించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఈ నిర్మాత.. డిసెంబర్ లో రానా-మిహీకా పెళ్లి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. అన్నీ అనుకూలిస్తే అంతకంటే ముందే రానాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు సురేష్ బాబు. రానా, మిహీకా ఒకరినొకరు చాన్నాళ్లుగా పరిచయస్తులనే విషయం తనకు తెలుసన్నారు సురేష్ బాబు. కాకపోతే వీళ్లిద్దరూ […]

పెళ్లి పనుల్లో పడిన సురేష్ బాబు
X

రానా ఇలా తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడో లేదో అలా సురేష్ బాబు పెళ్లి పనుల్లో పడిపోయారు. అవును.. రానా పెళ్లి పనులు ప్రారంభించినట్టు సురేష్ బాబు ప్రకటించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఈ నిర్మాత.. డిసెంబర్ లో రానా-మిహీకా పెళ్లి చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. అన్నీ అనుకూలిస్తే అంతకంటే ముందే రానాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు సురేష్ బాబు.

రానా, మిహీకా ఒకరినొకరు చాన్నాళ్లుగా పరిచయస్తులనే విషయం తనకు తెలుసన్నారు సురేష్ బాబు. కాకపోతే వీళ్లిద్దరూ ఇలా ప్రేమించుకుంటారని, పెళ్లి కూడా చేసుకుంటారని తను కలలో కూడా అనుకోలేదన్నారు. ఏదేమైనా రానా తీసుకున్న నిర్ణయం తమకు సంతోషాన్నిచ్చిందని ప్రకటించారు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో రానా తమ కుటుంబానికి చాలా పెద్ద పని పెట్టాడంటున్నారు సురేష్ బాబు. ఇప్పట్నుంచి పెళ్లి పనులు ప్రారంభించకపోతే కష్టమని, ఇకపై ఇదే పనిలో ఉండాలని అన్నారు. రీసెంట్ గా దగ్గుబాటి కాంపౌండ్ లో వెంకటేష్ కూతురు పెళ్లి జరిగింది. ఇప్పుడు రానా పెళ్లితో మరో శుభకార్యం చేయబోతోంది ఆ కుటుంబం. ఈ పెళ్లి కూడా అయిపోతే ఆ కుటుంబంలో రెండు పెద్ద పనులు పూర్తయినట్టవుతుంది.

First Published:  13 May 2020 1:10 PM IST
Next Story