Telugu Global
NEWS

కరెంట్‌ బిల్లులపై క్లారిటీ....

ఏపీలో కరెంట్‌ బిల్లుల మోత మోగుతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రకరకాలుగా బిల్లులు పెంచారని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇటు కొన్ని ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో కూడా అధిక బిల్లులు వచ్చాయని ప్రసారం చేశారు. అయితే కరెంట్‌ బిల్లులపై కావాలనే కొందరు కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేశారు… కొంత మంది అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని అధికారులు అంటున్నారు. ఈ గందరగోళంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కరెంట్‌ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని విద్యుత్‌ […]

కరెంట్‌ బిల్లులపై క్లారిటీ....
X

ఏపీలో కరెంట్‌ బిల్లుల మోత మోగుతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రకరకాలుగా బిల్లులు పెంచారని కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇటు కొన్ని ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో కూడా అధిక బిల్లులు వచ్చాయని ప్రసారం చేశారు.

అయితే కరెంట్‌ బిల్లులపై కావాలనే కొందరు కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేశారు… కొంత మంది అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని అధికారులు అంటున్నారు. ఈ గందరగోళంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కరెంట్‌ బిల్లులు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని విద్యుత్‌ శాఖ అధికారులు చెప్పారు.

ఏపీలో కరెంట్‌ బిల్లును మూడు కేటగిరీలుగా విభజించారు. జీరో నుంచి 75 యూనిట్ల వరకూ ఓ కేటగిరీ, 75 నుంచి 225 యూనిట్ల వరకూ రెండో కేటగిరీ, 225 నుంచి ఆపై ఉన్న యూనిట్లను మరో కేటగిరీగా విభజించారు. అయితే 500 యూనిట్లకు పైగా వాడితే యూనిట్‌కు 90 పైసలు పెంచినట్లు విద్యుత్‌ శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ చెప్పారు .

దీంతో 500 యూనిట్లపైన వాడినవారికి మాత్రమే ఈ నెల కరెంట్‌ బిల్లు పెరిగి వచ్చింది. మార్చి, ఏప్రిల్‌ రెండు నెలల బిల్లులు రావడం జరిగిందని కొందరు అపోహ పడుతున్నారని…అలాంటిది జరగలేదని ఆయన వివరణ ఇచ్చారు.

లేట్ పేమెంట్ సర్ ఛార్జ్ ఇప్పటివరకు ఎవ్వరికి వెయ్యలేదని కూడా తెలిపారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్‌ తీయడం వల్ల శ్లాబు రేట్లు పెరిగి.. ఎక్కువ బిల్లులు వచ్చాయన్నది వదంతులే అన్నారు. రెండు నెలలకూ కలిపి రీడింగ్‌ తీసినా.. బిల్లింగ్‌ మాత్రం ఏ నెలకు ఆ నెలే చేశామంటున్నారు.

ఈసారి లాక్‌డౌన్‌ వల్ల ప్రతీ ఒక్కరూ ఇళ్లలోనే ఉన్నారు. దీంతో విద్యుత్‌ వాడకం పెరిగింది. ఫలితంగా యూనిట్లు పెరిగి శ్లాబులూ మారాయని.. అంతే తప్ప రెండు నెలల రీడింగ్‌ వల్ల ఏ మార్పూ రాలేదని శ్రీకాంత్‌ చెప్పారు. వినియోగదారులకు బిల్లుపై ఎటువంటి అనుమానాలు ఉన్నా 1912 కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

First Published:  12 May 2020 8:40 PM GMT
Next Story