Telugu Global
Cinema & Entertainment

ఈసారి టిక్కెట్ రేట్లు పెంచుతారా?

పెట్టిన పెట్టుబడిలో దాదాపు సగం మొదటి వారం రోజుల్లోనే రాబట్టే రోజులివి. దీనికోసం నిర్మాతల దగ్గరున్న ఆయుధం టిక్కెట్ ధరల పెంపు. దీని చుట్టూనే మొదటి రోజు వసూళ్లు, హీరోల రికార్డులు, సినిమా రెవెన్యూ అన్నీ ఆధారపడి ఉన్నాయి. అలాంటి కీలకమైన అంశంపై ఇప్పుడు తర్జనభర్జన మొదలైంది. థియేటర్లు తెరుచుకున్న తర్వాత పెద్ద సినిమాలకు మొదటి వారం రోజులు టిక్కెట్ రేట్లు పెంచితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ నిర్మాతల్లో మొదలైంది. కరోనా వచ్చి ఆర్థిక […]

tollywood hero
X

పెట్టిన పెట్టుబడిలో దాదాపు సగం మొదటి వారం రోజుల్లోనే రాబట్టే రోజులివి. దీనికోసం నిర్మాతల దగ్గరున్న ఆయుధం టిక్కెట్ ధరల పెంపు. దీని చుట్టూనే మొదటి రోజు వసూళ్లు, హీరోల రికార్డులు, సినిమా రెవెన్యూ అన్నీ ఆధారపడి ఉన్నాయి. అలాంటి కీలకమైన అంశంపై ఇప్పుడు తర్జనభర్జన మొదలైంది. థియేటర్లు తెరుచుకున్న తర్వాత పెద్ద సినిమాలకు మొదటి వారం రోజులు టిక్కెట్ రేట్లు పెంచితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారనే చర్చ నిర్మాతల్లో మొదలైంది.

కరోనా వచ్చి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేసేంది. చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ప్రజలకు ఆదాయం బాగా తగ్గిపోయింది. అంతా ఖర్చులు తగ్గించుకొని బతుకుతున్న రోజులివి. ఇలాంటి టైమ్ లో తమ సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచితే ఆడియన్స్, మీడియా నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇక హీరోల ఫస్ట్ డే రికార్డులు సమస్య కాదు, నిర్మాతకు రికవరీ చాలా ముఖ్యం. మొదటి వారం రోజుల్లో ప్రైస్ క్యాపింగ్ లేకపోతే నిర్మాత గట్టెక్కడం చాలా కష్టం. ఈ సంగతి పక్కనపెడితే.. ఓవైపు టిక్కెట్ రేట్లు పెంచకుండా.. మరోవైపు సోషల్ డిస్టెన్స్ అంటూ సీటింగ్ కెపాసిటీని సగానికి తగ్గించేస్తే అది డిస్ట్రిబ్యూటర్ కు, నిర్మాతకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతుంది.

సో.. టిక్కెట్ ధరలు పెంచితే ప్రేక్షకుడు నష్టపోతాడు. పెంచకపోతే నిర్మాత నష్టపోతాడు. ప్రస్తుత ధరలతోనే సోషల్ డిస్టెన్సింగ్ తో థియేటర్లు నడిపే పరిస్థితి లేదు. దీనిపై నిర్మాతల మండలి, ప్రభుత్వం కలిసి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.

రాబోయే రోజుల్లో వకీల్ సాబ్, V, రెడ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

First Published:  12 May 2020 4:03 AM IST
Next Story