Telugu Global
NEWS

గ్రేటర్‌లో ఒక్కరోజే 79 కేసులు... తెలంగాణలో మళ్లీ కరోనా మోత !

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దాదాపు 15 రోజుల తర్వాత ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 79 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే కావడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 1,275కి చేరాయి. సోమవారం 50 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకూ డిశ్చార్జ్‌ అయిన కరోనా బాధితుల సంఖ్య 801. ప్రస్తుతం ఆసుపత్రిలో యాక్టివ్‌ గా ఉన్న కేసులు 444. […]

గ్రేటర్‌లో ఒక్కరోజే 79 కేసులు... తెలంగాణలో మళ్లీ కరోనా మోత !
X

తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. దాదాపు 15 రోజుల తర్వాత ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. సోమవారం ఒక్కరోజే 79 కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే కావడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు.

తెలంగాణలో మొత్తం కరోనా కేసులు 1,275కి చేరాయి. సోమవారం 50 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకూ డిశ్చార్జ్‌ అయిన కరోనా బాధితుల సంఖ్య 801. ప్రస్తుతం ఆసుపత్రిలో యాక్టివ్‌ గా ఉన్న కేసులు 444. ఇప్పటివరకూ మృతిచెందిన వారు 30 మంది.

కరోనా కేసులు తెలంగాణలో రికార్డు స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ 3న ఒక్కరోజే 75 కేసులు బయటపడ్డాయి. ఆతర్వాత ఇప్పుడే మే 11న 79 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఈ కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలో కావడంతో ఇక్కడి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రస్తుతం 4 జిల్లాలో మాత్రమే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గత 14 రోజులుగా 29 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. సోమవారం కరోనా నుంచి కోలుకుని హైదరాబాద్‌లో 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వీరితో పాటు వివిధ జిల్లాలకు చెందిన 8 మంది ఆసుపత్రుల నుంచి ఇంటికి వెళ్లారు.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో వనస్థలిపురం రెడ్‌జోన్‌గా మారింది. ఇక్కడ 50కి పైగా కేసులు నమోదు అయ్యాయి. సూర్యాపేటకు పల్లినూనె కోసం వెళ్లిన వ్యాపారి ద్వారా ఇక్కడ కరోనా వ్యాపించింది. దీంతో ఇక్కడ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.

First Published:  11 May 2020 8:13 PM GMT
Next Story