Telugu Global
National

కరోనా మార్పులు...  వర్క్ ఫ్రం హోమే బాగుంది

కరోనా అనేక రంగాల గతిని మార్చేస్తోంది. మూస ధోరణిలు కాకుండా కొత్త పంథాలను వెతుక్కునేలా  చేస్తోంది. ఇప్పుడు ఐటీ రంగం కూడా కరోనా దెబ్బకు తన పని విధానాలను మార్చుకుంటోంది. లాక్‌డౌన్ వల్ల అనేక రంగాలు కుదేలైనా ఐటీ రంగంపై మాత్రం పెనుప్రభావం తప్పింది. కారణం వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యమే. మొదట్లో వర్క్‌ ఫ్రం హోం అంటే సంశయించిన ఐటీ కంపెనీలు కరోనా విసిరిన చాలెంజ్‌తో అయిష్టంగానే వర్క్ ఫ్రం హోంకు సిద్ధపడ్డాయి. తమ సిబ్బందికి […]

కరోనా మార్పులు...  వర్క్ ఫ్రం హోమే బాగుంది
X

కరోనా అనేక రంగాల గతిని మార్చేస్తోంది. మూస ధోరణిలు కాకుండా కొత్త పంథాలను వెతుక్కునేలా చేస్తోంది. ఇప్పుడు ఐటీ రంగం కూడా కరోనా దెబ్బకు తన పని విధానాలను మార్చుకుంటోంది. లాక్‌డౌన్ వల్ల అనేక రంగాలు కుదేలైనా ఐటీ రంగంపై మాత్రం పెనుప్రభావం తప్పింది. కారణం వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యమే.

మొదట్లో వర్క్‌ ఫ్రం హోం అంటే సంశయించిన ఐటీ కంపెనీలు కరోనా విసిరిన చాలెంజ్‌తో అయిష్టంగానే వర్క్ ఫ్రం హోంకు సిద్ధపడ్డాయి. తమ సిబ్బందికి లాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు ఇంటి వద్దకే అందించి అక్కడి నుంచే పనిచేయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ విధానమే బెటర్ అంటున్నాయి ఐటీ కంపెనీలు.

వర్క్ ఫ్రం హోం వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా అవుట్‌ఫుట్‌ కూడా బాగానే ఉంటోందని అభిప్రాయపడుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ, ఐపీ భద్రతను కట్టుదిట్టం చేసుకుంటే ఆఫీస్‌ నుంచి కంటే వర్క్ ఫ్రం హోమే చాలా కంపెనీలకు వెసులుబాటుగా ఉంటుందని ఐటీ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.

కొన్ని కంపెనీలు మార్చి నెల మధ్య నుంచి పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానంలోనే పనులు నిర్వహిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం సమయంలో తమ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ సమర్థవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఒకప్పుడు వర్క్ ఫ్రం హోం అంటే వెనుకాడే పరిస్థితి ఉండేదని… కానీ ఇప్పుడు అదే బాగుందనిపిస్తోందని ‘పెగా సిస్టమ్స్‌ ఇండియా’ ఎండీ సుమన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కరోనా వల్ల ఐటీ రంగంలోనూ పెనుమార్పులు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు, బ్యాంకింగ్, వైద్య రంగం, విమానయానం, రిటైల్, తయారీ రంగాల్లో ఐటీ కంపెనీలు సేవలందిస్తున్నాయని… ఏవియేషన్, రిటైల్ రంగాలకు సేవలందిస్తున్న ఐటీ కంపెనీలకు కొద్ది కాలం ఇబ్బందులు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

First Published:  12 May 2020 10:00 AM IST
Next Story