Telugu Global
NEWS

రాజధాని తరలింపుపై ఎదురుచూస్తాం " ప్రభుత్వం

అమరావతి నుంచి రాజధాని తరలింపు వ్యవహారంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సచివాలయం తరలింపుపై సచివాలయ ఉద్యోగులు చేసిన తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతోందని… దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. చట్టవిరుద్దంగా ఏ పనిచేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అఫిడవిట్‌లో వివరించింది. శాసనపరమైన ప్రక్రియ ముగిసిన తర్వాతే రాజధానిని తరలిస్తామని… […]

రాజధాని తరలింపుపై ఎదురుచూస్తాం  ప్రభుత్వం
X

అమరావతి నుంచి రాజధాని తరలింపు వ్యవహారంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సచివాలయం తరలింపుపై సచివాలయ ఉద్యోగులు చేసిన తీర్మానాన్ని ఆధారంగా చేసుకుని గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఏకపక్షంగా రాజధానిని తరలించేందుకు సిద్ధమవుతోందని… దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

చట్టవిరుద్దంగా ఏ పనిచేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అఫిడవిట్‌లో వివరించింది. శాసనపరమైన ప్రక్రియ ముగిసిన తర్వాతే రాజధానిని తరలిస్తామని… అంత వరకు ఎదురుచూస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పిటిషనర్ కేవలం ఊహాజనితంగా పిటిషన్‌ దాఖలు చేశారని ప్రభుత్వం వ్యాఖ్యానించింది.

ప్రభుత్వం చట్టప్రకారమే ముందుకెళ్తామని అఫిడవిట్ దాఖలు చేయగా… అదే గద్దె తిరుపతిరావు సోమవారం మరో పిటిషన్ వేశారు. 20 ట్రక్కులతో ఫర్నీచర్‌ను విశాఖలోని విజ్ఞాన్‌ కాలేజీ సమీపంలో ఉన్న గ్రేహౌండ్స్‌ కాంపౌండ్‌లో అన్‌లోడ్‌ చేశారని, ఈ నెల 28న సచివాలయం తరలింపునకు ముహూర్తం కూడా ఖరారు చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని పిటిషన్‌లో కోర్టు దృష్టికి తెచ్చింది.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగా పిటిషన్లు వేయడంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  12 May 2020 3:40 AM IST
Next Story