రేపటి నుంచి ప్యాసింజర్ ట్రైన్లు ప్రారంభం
లాక్‌డౌన్‌పై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే మే 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఢిల్లీ నుంచి దేశంలోని 15 ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే ప్రకటించింది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి […]
లాక్‌డౌన్‌పై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే మే 12 నుంచి ప్రయాణికుల రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఢిల్లీ నుంచి దేశంలోని 15 ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్, దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్‌గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీ రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే ప్రకటించింది. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
అయితే కరోనా వైరస్ నేపథ్యంలో రైల్వేశాఖ పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. రైల్వేస్టేషన్ లలో థర్మల్ స్క్రీన్ తర్వాతే రైలులోకి అనుమతి ఇస్తారు. కరోనా లక్షణాలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వరు. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా సర్వీసులు పెంచుతామని రైల్వే శాఖ తెలిపింది.
మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా నిలిచిపోయింది. విమానాలు, రైళ్లు, బస్సులు నడవడం లేదు. దీంతో లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన రవాణాను దశలవారీగా పునరుద్దించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశరాజధాని నుంచి 15 రైలు సర్వీసులను నడపనుంది.
రేపటి నుంచి నడిచే రైళ్లన్నీ ఏసీ కోచ్‌లే. అయితే కొన్ని స్టేషన్లలో మాత్రం ఆగుతుందని… సోమవారం ఏఏ స్టేషన్లలో ఆగుతుందనే విషయంపై షెడ్యూల్ విడుదల చేస్తారు.
ఇప్పటికే వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర వేసేందుకు 366 శ్రామిక్ రైళ్లను రైల్వేశాఖ నడుపుతోంది. సుమారు నాలుగు లక్షల మంది కార్మికులను సొంత రాష్ట్రాలకు రైల్వేశాఖ చేరవేసింది.
లాక్‌డౌన్‌కు ముందు దాదాపు 12 వేల ట్రైన్లు ప్రతిరోజూ నడిచేవి. అయితే లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ప్రయాణికుల రైళ్లను దశలవారీగా పునరుద్ధరించాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది.