ఫోన్, నోట్ల శుద్ధికి ఓ పరికరం
కరోనా భయంవల్ల నిప్పును కూడా కడగాలేమో! తాకడంవల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందంటున్నందు వల్ల మొబైల్ ఫోన్, కరెన్సీ నోట్లను శుభ్రం చేయడానికి హైదరాబాద్ లోని డి.ఆర్.డి.ఓ. సంస్థ ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది మొబైల్ ఫోన్లు, ఐ ప్యాడ్లు, లాప్ టాప్లు, కరెన్సీ నోట్లు, చలానాలను కూడా శుద్ధి చేస్తుంది. తాకితే కరోనా వస్తుందన్న భయం ఉన్నందువల్ల ఈ పరికరాలను ముట్టుకోకుండానే ఒక పెట్టె లాంటిది తయారు చేశారు. ఈ పెట్టెలో పెడ్తే ఏ పరికరాలనైనా […]
కరోనా భయంవల్ల నిప్పును కూడా కడగాలేమో! తాకడంవల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందంటున్నందు వల్ల మొబైల్ ఫోన్, కరెన్సీ నోట్లను శుభ్రం చేయడానికి హైదరాబాద్ లోని డి.ఆర్.డి.ఓ. సంస్థ ఓ పరికరాన్ని తయారు చేసింది. ఇది మొబైల్ ఫోన్లు, ఐ ప్యాడ్లు, లాప్ టాప్లు, కరెన్సీ నోట్లు, చలానాలను కూడా శుద్ధి చేస్తుంది.
తాకితే కరోనా వస్తుందన్న భయం ఉన్నందువల్ల ఈ పరికరాలను ముట్టుకోకుండానే ఒక పెట్టె లాంటిది తయారు చేశారు. ఈ పెట్టెలో పెడ్తే ఏ పరికరాలనైనా శుద్ధి చేసే యు.వి.సి.ని తయారు చేశారు. శుద్ధి చేయడానికి ఉంచిన పెట్టె దానంతట అదే తెరుచుకుని అదే మూసుకుంటుంది. దీనికి ద్రువస్ (డి.ఆర్.యు.వి.ఎస్.) అని పేరు పెట్టారు. చెక్కులు, పాస్ బుక్కులు, కాగితాలు, ఎన్వలప్ లను కూడా శుద్ధి చేయవచ్చు.
కరెన్సీ నోట్లను శుద్ధి చేయడానికి “నోట్స్ క్లీన్” అని మరో పరికరం కూడా డి.ఆర్.డి.ఒ. తయారు చేసింది.