తొలి సినిమాకే తప్పుకున్న కార్తికేయ
తెరవెనక వ్యక్తిగా, టెక్నికల్ గా ఎన్నో విషయాలు తెలిసిన టెక్నీషియన్ గా రాజమౌళి తనయుడు కార్తికేయకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి సడెన్ గా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆకాశవాణి అనే ప్రాజెక్ట్ ప్రారంభించాడు. బాహుబలి లాంటి బడా సినిమాకు వర్క్ చేసి, ప్రోమోలు-పబ్లిసిటీలో తన మార్క్ చూపించిన కార్తికేయ.. నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి కార్తికేయ తప్పుకున్నాడు. అవును.. ఆకాశవాణి ప్రాజెక్ట్ నుంచి తను తప్పుకుంటున్నట్టు […]

తెరవెనక వ్యక్తిగా, టెక్నికల్ గా ఎన్నో విషయాలు తెలిసిన టెక్నీషియన్ గా రాజమౌళి తనయుడు కార్తికేయకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి సడెన్ గా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆకాశవాణి అనే ప్రాజెక్ట్ ప్రారంభించాడు. బాహుబలి లాంటి బడా సినిమాకు వర్క్ చేసి, ప్రోమోలు-పబ్లిసిటీలో తన మార్క్ చూపించిన కార్తికేయ.. నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి కార్తికేయ తప్పుకున్నాడు.
అవును.. ఆకాశవాణి ప్రాజెక్ట్ నుంచి తను తప్పుకుంటున్నట్టు స్వయంగా కార్తికేయ ప్రకటించాడు. ఆల్రెడీ మరో సినిమాకు లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న కారణంగా.. ఆకాశవాణి ప్రాజెక్టుకు చెప్పుకోదగ్గ స్థాయిలో సమయం వెచ్చించలేకపోతున్నానని, అందుకే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు కార్తికేయ ఓ లెటర్ రిలీజ్ చేశాడు.
కార్తికేయ, అతడి ఫ్రెండ్ అశ్విన్ గంగరాజు కలిసి ఈ సినిమా స్టార్ట్ చేశారు. ఇప్పుడు కార్తికేయ, తన భాగాన్ని AU&I స్టుడియోస్ అధినేత పద్మనాభరెడ్డికి అప్పగించాడు. ఇకపై అశ్విన్, పద్మనాభరెడ్డి కలిసి ఆకాశవాణి ప్రాజెక్టును నిర్మిస్తారు. కార్తికేయ పూర్తిగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుపై వర్క్ చేయబోతున్నాడు.
Some journeys have to come to an unexpected end…
Wishing the best to my friend, director @AshwinGangaraju and the entire team on the project. #Aakashavaani pic.twitter.com/aZfDtsheAZ— S S Karthikeya (@ssk1122) May 9, 2020