Telugu Global
NEWS

ఎల్‌జీ పాలిమర్స్... అన్ని వేళ్లు బాబు వైపే...

ఎల్‌జీ పాలిమర్స్‌ వ్యవహారంలో ఇప్పుడు అందరి వేళ్లు చంద్రబాబు వైపే మళ్లుతున్నాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక నుంచి ఈ ప్రమాదం వరకు చంద్రబాబు ప్రమేయం బయటపడుతోంది. ఎల్‌జీ పాలిమర్స్‌కు తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక సాయాలు చేశారు. వెంకటాపురంలో 1961లో ఇక్కడ హిందుస్థాన్‌ పాలిమర్స్‌ పేరుతో కంపెనీ మొదలైంది. అప్పుడు కంపెనీ జనావాసానికి చాలా దూరంగానే ఉండేది. ఆ తర్వాత అనేక మంది కంపెనీకి సమీపంలోనే ఇళ్లు కట్టుకుంటూ వచ్చారు. 1978లో హిందుస్థాన్ పాలిమర్స్‌ ఆధ్వర్యంలో […]

ఎల్‌జీ పాలిమర్స్... అన్ని వేళ్లు బాబు వైపే...
X

ఎల్‌జీ పాలిమర్స్‌ వ్యవహారంలో ఇప్పుడు అందరి వేళ్లు చంద్రబాబు వైపే మళ్లుతున్నాయి. ఎల్‌జీ పాలిమర్స్‌ పుట్టుక నుంచి ఈ ప్రమాదం వరకు చంద్రబాబు ప్రమేయం బయటపడుతోంది. ఎల్‌జీ పాలిమర్స్‌కు తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక సాయాలు చేశారు.

వెంకటాపురంలో 1961లో ఇక్కడ హిందుస్థాన్‌ పాలిమర్స్‌ పేరుతో కంపెనీ మొదలైంది. అప్పుడు కంపెనీ జనావాసానికి చాలా దూరంగానే ఉండేది. ఆ తర్వాత అనేక మంది కంపెనీకి సమీపంలోనే ఇళ్లు కట్టుకుంటూ వచ్చారు. 1978లో హిందుస్థాన్ పాలిమర్స్‌ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని విజయ్‌ మాల్యాకు చెందిన యూబీ గ్రూప్ కొనుగోలు చేసింది.

1997లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయ్‌ మాల్యా గ్రూప్ నుంచి ఇది దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ పాలిమర్స్‌ చేతికి మారింది. ఈ డీల్‌లో చంద్రబాబుకు సన్నిహితుడు, అటు విజయ్ మాల్యాతో కలిసి లిక్కర్ వ్యాపారం చేసిన డీకే ఆదికేశవులు కీలక పాత్ర పోషించారని చెబుతుంటారు. ఈ డీల్‌ కుదరడంలో చంద్రబాబు కూడా తన వంతు సాయం చేశారని చెబుతుంటారు. అలా విజయ్ మాల్యా నుంచి ఎల్‌జీ చేతికి వచ్చిన ఈ ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబునాయుడు తొలి నుంచి సానుకూలంగా వ్యవహరించే వారన్న విమర్శలు ఉన్నాయి.

ఎల్‌జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న భూముల్లో 162 ఎకరాలు సింహాచలం ఆలయానికి చెందినవి. ఈ భూములపై కోర్టులో కూడా వివాదం కొనసాగుతోంది. ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సింహాచలం ఆలయం ఏళ్ల తరబడి పోరాటం చేస్తూనే ఉంది.

2014లో తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూముల వ్యవహారంలో ఎల్‌జీ సంస్థకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ 162 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో రెవెన్యూ శాఖ ఉంచగా… చంద్రబాబు సీఎం కాగానే 2015 ఆగస్టులో ఈ భూములను డీ నోటిఫై చేసింది. ఆ తర్వాత ఎల్‌జీ పాలిమర్స్‌కు సొంతం చేశారు. ఈ భూమి విలువ 16వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ఇలా సింహాచలం ఆలయ భూములను 2015లో చంద్రబాబు ప్రభుత్వం ఎల్‌జీ గ్రూప్‌కు అప్పగించేందుకు చక్రం తిప్పింది. ఈ ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ తన ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని 2016లో నిర్ణయించింది. 415 టన్స్‌ ఫర్ డే నుంచి 655 టన్స్‌ ఫర్ డేకు సామర్థ్యం పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబు హయాంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంది.

ఈ వినతిని పరిశీలించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి… ఇది ప్రమాదకర రసాయనాలతో కూడిన వ్యవహారం కాబట్టి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదించాలని భావించింది. కానీ చంద్రబాబు రంగంలోకి దిగడంతో కేంద్ర పర్యావరణ శాఖను సంప్రదించకుండానే 2018 డిసెంబర్‌ 27న ఫ్యాక్టరీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చేసింది. ఆ అనుమతులు ఏకంగా 2025 డిసెంబర్‌ వరకు చెల్లుబాటు అయ్యేలా అనుమతులు ఇచ్చింది.

2018 జూన్‌లోనే ఎల్ జీ పాలిమర్స్ వ్యర్థాల నిర్వహణకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే అనుమతులు ఇచ్చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల సాయంతో ఫ్యాక్టరీని విస్తరించిన అంశాన్ని ఎల్‌జీ పాలిమర్స్ కూడా ఒక అఫిడవిట్‌లో అంగీకరించింది. ఇలా కేంద్ర పర్యావరణ శాఖను సంప్రదించకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఎల్‌జీ పాలిమర్స్‌కు అనుమతులు ఇస్తూ వెళ్లడం వల్లే ఇది జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది.

First Published:  10 May 2020 7:36 AM IST
Next Story