సాయిపల్లవి నుంచి ఒకేసారి రెండు ఫస్ట్ లుక్స్
ఈరోజు సాయిపల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి పల్లవి నటిస్తున్న రెండు సినిమాల నుంచి లుక్స్ విడుదల చేశాయి ఆయా నిర్మాణ సంస్థలు. వీటిలో ఒకటి విరాటపర్వం కాగా.. ఇంకోటి లవ్ స్టోరీ. వీటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న లుక్ విరాటపర్వం. అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది సాయిపల్లవి. అంతేకాదు, ఈ సమయంలో ఆమె తన ఆలోచనలను రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె డ్రెస్సింగ్ సాధారణ తెలుగింటి అమ్మాయిల మాదిరిగా చాలా సింపుల్గా […]
ఈరోజు సాయిపల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి పల్లవి నటిస్తున్న రెండు సినిమాల నుంచి లుక్స్ విడుదల చేశాయి ఆయా నిర్మాణ సంస్థలు. వీటిలో ఒకటి విరాటపర్వం కాగా.. ఇంకోటి లవ్ స్టోరీ. వీటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న లుక్ విరాటపర్వం.
అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తోంది సాయిపల్లవి. అంతేకాదు, ఈ సమయంలో ఆమె తన ఆలోచనలను రాసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె డ్రెస్సింగ్ సాధారణ తెలుగింటి అమ్మాయిల మాదిరిగా చాలా సింపుల్గా ఉంది. కానీ, ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేది, తను ఎక్కువగా ఇష్టపడేవారి కోసం ఎదురుచూడ్డంలో ఆమె అనుభవిస్తున్న బాధ ఈ లుక్ లో కనిపిస్తోంది.
ఇక సాయిపల్లవి నుంచి వచ్చిన మరో లుక్ లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి సాయిపల్లవికి సంబంధించిన మరో లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో సాయిపల్లవి లుక్ ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటికే ఆడియన్స్ కు ఓ ఐడియా ఉంది. బర్త్ డే కాబట్టి కొత్తగా మరో స్టిల్ రిలీజ్ చేశారంతే.
విరాటపర్వం సినిమా లాస్ట్ షెడ్యూల్ లో చిన్న పార్ట్ మినహా మొత్తం పూర్తయింది. అటు లవ్ స్టోరీ కూడా 15 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ రెండు సినిమాలతో త్వరలోనే పలకరించబోతోంది సాయిపల్లవి.