Telugu Global
National

చంద్రబాబును కట్టేసి గదిలో వేయండి... లేకుంటే విపరీత పరిణామాలు " భువనేశ్వరికి ప్రసన్నకుమార్ సూచన

చంద్రబాబునాయుడు రాజకీయంగా, విలువల పరంగా పూర్తిగా పతనమైపోయారని.. ఇక కోలుకునే అవకాశం కూడా లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. విశాఖ ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ప్రకటిస్తే దానిపైనా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటే దీన్ని బట్టి ఆయన శరీరంలో రక్తం కాదు… విషం ప్రవహిస్తోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు. చంద్రబాబుది మనిషి జన్మేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. క్రూరమృగాల, రాక్షసులతత్వం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. భువనేశ్వరిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత సొంత మామకే వెన్నుపోటు […]

చంద్రబాబును కట్టేసి గదిలో వేయండి... లేకుంటే విపరీత పరిణామాలు  భువనేశ్వరికి ప్రసన్నకుమార్ సూచన
X

చంద్రబాబునాయుడు రాజకీయంగా, విలువల పరంగా పూర్తిగా పతనమైపోయారని.. ఇక కోలుకునే అవకాశం కూడా లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. విశాఖ ఘటనలో బాధితులకు కోటి రూపాయలు పరిహారం ప్రకటిస్తే దానిపైనా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారంటే దీన్ని బట్టి ఆయన శరీరంలో రక్తం కాదు… విషం ప్రవహిస్తోంది అన్నది స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

చంద్రబాబుది మనిషి జన్మేనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. క్రూరమృగాల, రాక్షసులతత్వం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. భువనేశ్వరిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

భువనేశ్వరిపై గౌరవంతోనే చెబుతున్నామని… ఇప్పటికైనా ఆమె చంద్రబాబును కట్టేసి గదిలో బంధించాలని కోరారు. లేకుంటే ప్రజలు దేనితో కొడతారో ఊహించలేమన్నారు. చంద్రబాబును గదిలో పెట్టి ఆయన చేస్తున్న లోఫర్ రాజకీయాలను కట్టడి చేయాలని భువనేశ్వరిని కోరారు.

మోడీ ఏపీలో అడుగుపెట్టడానికి వీల్లేదన్న చంద్రబాబే… ఇప్పుడు సిగ్గు లేకుండా ఏపీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వండి అంటూ మోడీకి లేఖ రాయడం సిగ్గుచేటన్నారు.

టీడీపీ నాయకులు ఒక్కరు కూడా బయటకు రాకుండా ఇళ్లలో కూర్చున్నా… కరోనా విపత్తులో ప్రజలకు తాము అండగా ఉంటున్నామని… అలాంటి తమపై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనం అన్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.

First Published:  9 May 2020 5:36 AM IST
Next Story