Telugu Global
Cinema & Entertainment

104 డిగ్రీల జ్వరంతో చిరంజీవి షూటింగ్

దాదాపు 3 రోజులుగా జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు సంబంధించి హంగామా నడుస్తోంది. రేపటితో ఈ సినిమా 30 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ సంస్థ సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తోంది. నాని వాయిస్ ఓవర్ తో ఆ సినిమా తెరవెనక జరిగిన విశేషాల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఇందులో భాగంగా ఆ సినిమా షూటింగ్ లో ఒకానొక సందర్భంలో 104 డిగ్రీల జ్వరంతో చిరంజీవి షూట్ చేసిన ఘటనను బయటపెట్టింది ఆ సంస్థ. […]

104 డిగ్రీల జ్వరంతో చిరంజీవి షూటింగ్
X

దాదాపు 3 రోజులుగా జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాకు సంబంధించి హంగామా నడుస్తోంది. రేపటితో ఈ సినిమా 30 ఏళ్లు పూర్తిచేసుకోబోతోంది. ఈ సందర్భంగా వైజయంతీ మూవీస్ సంస్థ సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తోంది. నాని వాయిస్ ఓవర్ తో ఆ సినిమా తెరవెనక జరిగిన విశేషాల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఇందులో భాగంగా ఆ సినిమా షూటింగ్ లో ఒకానొక సందర్భంలో 104 డిగ్రీల జ్వరంతో చిరంజీవి షూట్ చేసిన ఘటనను బయటపెట్టింది ఆ సంస్థ.

సినిమాలో దినక్కుత్తా అనే పాట ఉంది. ఆ సాంగ్ కోసం వాహిని స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు. షూట్ పూర్తయిన వెంటనే శ్రీదేవి హిందీ మూవీకి షిప్ట్ అవ్వాలి. ఇటు చూస్తే చిరంజీవికి 104 డిగ్రీల జ్వరం. ఒకట్రెండు రోజులు షూటింగ్ ఆపడం వల్ల ఇబ్బంది లేదు. కానీ రిలీజ్ డేట్ దగ్గరపడింది. షూటింగ్ ఒక రోజు ఆగినా రిలీజ్ కష్టం. దీంతో చిరంజీవి తెగించారు. సెట్ లోనే డాక్టర్ ను పెట్టుకొని, జ్వరంతోనే స్టెప్పులేశారు.

అప్పటి అలాంటి సంఘటనల్ని నిర్మాత అశ్వనీదత్ గుర్తుచేసుకున్నారు. చిరంజీవిలో అంతటి అంకితభావం ఉంది కాబట్టే జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి సినిమాలు వచ్చాయంటున్నారు.

First Published:  8 May 2020 3:30 PM IST
Next Story