Telugu Global
National

ఇకపై టోకెన్ ఉంటేనే మద్యం

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూత పడిన మద్యం దుకాణాలు మే 4 నుంచి తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలు షురూ చేశాయి. అయితే చాలా ప్రాంతాల్లో మద్యం ప్రియులు షాపుల వద్ద గుమి కూడటం.. లైన్ లో భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వంటి విషయాలను గమనించిన ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై మద్యం కొనాలంటే ఈ-టోకన్ తీసుకోవాల్సిందేనని తేల్చి […]

ఇకపై టోకెన్ ఉంటేనే మద్యం
X

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మూత పడిన మద్యం దుకాణాలు మే 4 నుంచి తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాలు షురూ చేశాయి.

అయితే చాలా ప్రాంతాల్లో మద్యం ప్రియులు షాపుల వద్ద గుమి కూడటం.. లైన్ లో భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వంటి విషయాలను గమనించిన ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై మద్యం కొనాలంటే ఈ-టోకన్ తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

ఆన్‌లైన్‌లో ముందుగా వివరాలన్నీ నోట్ చేసుకోవడంతో పాటు ఏ దుకాణంలో కొనాలనుకుంటున్నారో అనే వివరాలు ఇవ్వాలి. అప్పుడు ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అంతే కాకుండా ఏ టైంలో దుకాణానికి వెళ్లాలో దాంట్లో రాసి ఉంటుంది. అదే సమయానికి దుకాణానికి వెళ్లి నేరుగా కొనుగోలు చేయాలి. ఢిల్లీ దుకాణాల్లో ఇకపై టోకెన్ ఉంటేనే అమ్మకాలు జరుపుతామని సీఎం కేజ్రీవాల్ కూడా స్పష్టం చేశారు.

First Published:  8 May 2020 7:31 AM IST
Next Story