Telugu Global
National

వలసకూలీలపై నుంచి దూసుకెళ్లిన రైలు

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. లాక్‌డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడిచి గమ్యస్థానాలకు వెళ్తున్న వారిపైకి రైలు దూసుకెళ్లింది. ఔరంగబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది. జల్నాలోని ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో అలసిపోయి రైల్వే ట్రాక్‌పైనే సేద తీరారు. తెల్లవారుజామున 5. 15 నిమిషాల సమయంలో వీరిపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. దాంతో 16 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలపై జనాలు ఉండటాన్ని గమనించిన లోకో […]

వలసకూలీలపై నుంచి దూసుకెళ్లిన రైలు
X

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. లాక్‌డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడిచి గమ్యస్థానాలకు వెళ్తున్న వారిపైకి రైలు దూసుకెళ్లింది. ఔరంగబాద్‌లో ఈ ప్రమాదం జరిగింది. జల్నాలోని ఐరన్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వలస కూలీలు మధ్యప్రదేశ్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో అలసిపోయి రైల్వే ట్రాక్‌పైనే సేద తీరారు.

తెల్లవారుజామున 5. 15 నిమిషాల సమయంలో వీరిపైకి గూడ్స్ రైలు దూసుకెళ్లింది. దాంతో 16 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పట్టాలపై జనాలు ఉండటాన్ని గమనించిన లోకో పైలట్‌… రైలును నిలిపివేసేందుకు ప్రయత్నించారని… కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.

రైలు ఆగే లోపే కూలీలపై నుంచి వెళ్లిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్పీఎఫ్‌, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

First Published:  8 May 2020 7:34 AM IST
Next Story