Telugu Global
NEWS

అక్కడ ముఖ్యమంత్రే పర్యటిస్తున్నా... ఎందుకీ అబద్దపు ప్రచారాలు..?

విశాఖలోని ఎల్జీ పాిలిమర్స్ కంపెనీలో స్టెర్లిన్ గ్యాస్ లీకైన ఘటనలో అస్వస్థతకు గురైన వాళ్లు ప్రస్తుతం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ బాధితులను ఏపీ సీఎం జగన్ స్వయంగా వచ్చి పరామర్శించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొని అక్కడి నుంచి నేరుగా కేజీహెచ్‌కు వచ్చారు. బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ప్రమాద సమయంలో ఏర్పడిన ఇబ్బందుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కొంత మంది […]

అక్కడ ముఖ్యమంత్రే పర్యటిస్తున్నా... ఎందుకీ అబద్దపు ప్రచారాలు..?
X

విశాఖలోని ఎల్జీ పాిలిమర్స్ కంపెనీలో స్టెర్లిన్ గ్యాస్ లీకైన ఘటనలో అస్వస్థతకు గురైన వాళ్లు ప్రస్తుతం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ బాధితులను ఏపీ సీఎం జగన్ స్వయంగా వచ్చి పరామర్శించారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొని అక్కడి నుంచి నేరుగా కేజీహెచ్‌కు వచ్చారు. బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. ప్రమాద సమయంలో ఏర్పడిన ఇబ్బందుల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు కొంత మంది అబద్దపు ప్రచారాలకు తెరతీశారు. విశాఖ ప్రజలకు ముప్పు ఇంకా ఉందని.. రెండో సారి గ్యాస్ లీకైందని రూమర్లు పుట్టిస్తున్నారు. ఆ గ్యాస్ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై దుష్ఫలితాలు చూపిస్తాయని సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు. లీకైన గ్యాస్ పీల్చుకున్న పది నిమిషాల్లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతున్నారని… వాళ్ల ప్రాణాలకు ముప్పుందని చెబుతున్నారు.

అయితే, లీకైన గ్యాస్ మరీ అంత ప్రమాదకరం కాదని.. ఎక్కువగా నీళ్లు తాగడం.. తడి గుడ్డను మొఖానికి చుట్టుకోవడం వల్ల గ్యాస్ ప్రభావాన్ని తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో పర్యటిస్తున్నా ఈ వదంతులను మాత్రం ఆపడం లేదు. మరీ అంత ప్రమాదకరమైతే అధికారులు సీఎంను అక్కడకు వెళ్లమని ఎలా చెబుతారు… సీఎం జగన్ కూడా ఆ గ్యాస్ వల్ల విశాఖలో ఇబ్బందికర పరిస్థితులే ఉంటే వచ్చేవారా? అని ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ జగన్ అక్కడ స్వయంగా పర్యటించడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు దూరం చేయడంతో పాటు గ్యాస్ మరీ అంత ప్రమాదకరం కాదని నిరూపించారని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఏపీ పోలీసులు వదంతులు వ్యాప్తి చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్యాస్ లీకేజీపై అబద్దపు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.

First Published:  7 May 2020 9:26 AM IST
Next Story