Telugu Global
Cinema & Entertainment

సునీల్ కు మళ్లీ బెర్త్ కన్ ఫర్మ్

హీరోల పాత్రల నుంచి మళ్లీ కామెడీ క్యారెక్టర్ల వైపు టర్న్ అయ్యాడు సునీల్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ కామెడీ క్యారెక్టర్లు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, తన పూర్వ వైభవాన్ని సునీల్ సొంతం చేసుకుంటాడని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్-సునీల్ కాంబినేషన్ లో హిలేరియస్ కామెడీ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత సినిమాలో సునీల్ ఉన్నాడు. ఆ పాత్ర అటు […]

సునీల్ కు మళ్లీ బెర్త్ కన్ ఫర్మ్
X

హీరోల పాత్రల నుంచి మళ్లీ కామెడీ క్యారెక్టర్ల వైపు టర్న్ అయ్యాడు సునీల్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ కామెడీ క్యారెక్టర్లు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, తన పూర్వ వైభవాన్ని సునీల్ సొంతం చేసుకుంటాడని అంతా అనుకున్నారు. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్-సునీల్ కాంబినేషన్ లో హిలేరియస్ కామెడీ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు.

త్రివిక్రమ్ తీసిన అరవింద సమేత సినిమాలో సునీల్ ఉన్నాడు. ఆ పాత్ర అటు కామెడీ కాకుండా, ఇటు సీరియస్ మోడ్ లో కూడా సాగకుండా తేలిపోయింది. ఆ తర్వాత అల వైకుంఠపురములో సినిమాలో కూడా సునీల్ కు చోటిచ్చాడు త్రివిక్రమ్. ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో కామెడీకే పరిమితం చేశాడు. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు.

ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాకు కూడా సునీల్ ను తీసుకున్నాడు త్రివిక్రమ్. హారిక హాసిని బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో సునీల్ కూడా ఉన్నాడు. ఇలా తన ప్రతి సినిమాలో సునీల్ కు చోటు ఇస్తున్నాడు కానీ, మంచి క్యారెక్టర్ మాత్రం పెట్టలేకపోతున్నాడు ఈ దర్శకుడు. అప్ కమింగ్ సినిమాతోనైనా ఆ లోటు భర్తీ అవుతుందేమో చూడాలి.

First Published:  7 May 2020 12:33 PM IST
Next Story